ఆధార్ కార్డులో ఏ ఏ వివరాలు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు మరియు ఆధార్ కార్డుతో కచ్చితంగా లింక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి?
ప్రస్తుతం భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడికి తప్పనిసరిగా ఉండవలసింది ఆధార్ కార్డు అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఆధార్ కార్డు కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు చాలామందికి తెలియవు. అందులో ముఖ్యంగా ఆధార్ కార్డులో ఉన్న వివరాలు ఏది ఎన్నిసార్లు మార్పులు చేసుకోవచ్చు. ఆధార్ సంబంధించి ఏ ఏ అంశాలు ఆన్లైన్లో మనం ఇంటి వద్దనే ఉండి మార్పులు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, ప్రస్తుతం అత్యవసరంగా మనం ఆధార కార్డు కు సంబంధించి చేయవలసిన పని ఏముంది? మొదలగు అంశాలన్నీ ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఆధార్ లో ఏఏ అంశాలు ఉంటాయి
ఆధార్ కార్డులో (ఆధార్ సర్వర్ లో)ముఖ్యంగా దిగువ తెలిపిన అంశాలు ఉంటాయి. అవి ఏమిటంటే
1. మన పేరు
2. తండ్రి లేదా భర్త పేరు
3. పుట్టిన తేదీ
4. చిరునామా
5. ఫోన్ నెంబర్
6. ఈ మెయిల్ అడ్రస్
7. మన రెండు కళ్ళ యొక్క
8. మన రెండు చేతులు యొక్క వేళ్ళ ముద్రలు
9. మన ఫోటో
10. లింగం
ఇప్పుడు పైన తెలిపిన అంశాలలో ఒక్కొక్క అంశము ఎన్నిసార్లు మనం మార్చుకోవచ్చు. అందులో మనం ఇంటి వద్దనే ఉంటూ మొబైల్ ఫోన్లో ఏ ఏ అంశాలు మార్చుకోవచ్చు. ఏ ఏ అంశాలు ఆధార్ సెంటర్ కు వెళ్లి మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం.
1.మన పేరు:-
మన పేరును మన జీవితంలో రెండు సార్లు మాత్రమే మార్చుకోగలము. ఇది మార్చడానికి కావలసిన ప్రూఫ్ ఏమిటంటే మీరు ప్రస్తుతం ఉన్న పేరుని ఏ పేరుగా మార్చాలి అనుకుంటున్నారో ఆ పేరుతో సరిపోలిన ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ఉండాలి.ఉదాహరణకు పాన్ కార్డు , ఓటర్ కార్డు మొదలగునవి.దీని కొరకు మీకు దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి చేసుకోవచ్చు లేదా మనం ఇంటి వద్దనే మొబైల్ ఫోన్లో ఆన్లైన్లో నే చేసుకోవచ్చు.
--> మీ మొబైల్ లోనే మార్చుకోవాలి అనుకుంటే ఆ పద్ధతి తెలుసుకొనుట కొరకు దిగు లింకుపై క్లిక్ చేయండి.
Link : Click Here
2. తండ్రి లేదా భర్త లేదా గార్డియన్ పేరు:-
ఈ వివరాలు చిరునామా లో భాగంగా ఉంటుంది.ఉదాహరణకు వివాహం జరిగిన మహిళ అత్తవారి ఇంటి వెళ్ళేటప్పుడు అక్కడి చిరునామా తో పాటు భర్త పేరు మార్చుకోవచ్చు.దీనికి మారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ వివరాల మార్పు కొరకు మీరు దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లిన లేదా మీ ఇంటి వద్దనే మీ మొబైల్ ఫోన్లో ఆన్లైన్లో నే చేసుకోవచ్చు.
3. పుట్టిన తేదీ:-.
పుట్టిన తేదీ లేదా వయస్సును జీవితం మొత్తంలో రెండుసార్లు మాత్రమే మార్చుకోగలము. అది ఒకసారి మనం ఆధార్ కేంద్రం వద్ద గాని, సొంతంగా ఆన్లైన్లో గాని మార్చుకోగలం. కానీ రెండవసారి మార్చుకోవాలి అనుకుంటే మనకు హైదరాబాదులో ఉన్న రీజనల్ ఆఫీసులో మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. రెండవసారి మనం ఆధార్ సెంటర్లో గానీ మనం సొంతంగా గాని మార్చుకొనే అవకాశం లేదు.దీని కొరకు కచ్చితంగా గ్రామపంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ కార్యాలయము నుండి వచ్చిన బర్త్ సర్టిఫికెట్ ఉండాలి.
4. చిరునామా:-
మనం మన జీవితంలో చిరునామాను ఎన్నిసార్లు అయినా మనం మార్చుకోవచ్చు. దీని కొరకు మీకు దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లిన లేదా మనం ఇంటి వద్దనే మొబైల్ ఫోన్లో ఆన్లైన్లో నే చేసుకోవచ్చు. దీని కొరకు సంబంధిత చిరునామా ఆధారం ఉండాలి.
--> మీ మొబైల్ లోనే మార్చుకోవాలి అనుకుంటే ఆ పద్ధతి తెలుసుకొనుట కొరకు దిగు లింకుపై క్లిక్ చేయండి.
Link : Click Here
5.ఫోన్ నెంబర్:-
ఫోన్ నెంబర్ కూడా మన జీవితకాలంలో ఎన్నిసార్లైనా మనం మార్చుకోవచ్చు. కానీ దీనికోసం ఆధార్ కేంద్రానికి వెళ్లి మాత్రమే మార్చుకోవాలి.
--> మీ ఆధార్ తో మీ మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి లింక్ పై క్లిక్ చేయండి .
Link : Click Here
6. ఈమెయిల్ అడ్రస్:-
ఈమెయిల్ అడ్రస్ ని కూడా జీవితకాలంలో ఎన్నిసార్లు అయినా మనం మార్చుకోవచ్చు.దీని కొరకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లిన సరే లేదా మీ మొబైల్ ఫోన్లో ఇంటి వద్దనైనా చేసుకోవచ్చు.
7. మన రెండు కళ్ళ యొక్క ముద్రలు:-
మన రెండు కళ్ళ యొక్క ముద్రలు దానినే ఐరిస్ అంటారు. దానిని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు కానీ దీని కొరకు కేవలం ఆధార్ కేంద్రానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. మనం ఇంటి వద్ద చేసుకోలేము.
8.మన రెండు చేతుల యొక్క వెళ్ళ ముద్రలు:-
మన రెండు చేతుల యొక్క వేళ ముద్రలు దీనినే మన వాడికి భాషలో బయోమెట్రిక్ అని అంటాము. దీనిని కూడా మనం ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. కానీ దీనికి కూడా మార్చుకోవడానికి ఆధార్ కేంద్రానికి మాత్రమే వెళ్లాలి ఇంటి వద్దను మార్చుకోవడానికి అవకాశం లేదు.
9. మన ఫోటో :-
ఆధార్ కార్డులో ఉన్న మన ఫోటోను కూడా ఎన్నిసార్లు అయినా మనం మార్చుకోవచ్చు. దీనికొరకు ఆధార్ కేంద్రానికి మాత్రమే వెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.
10. లింగం:-
ఆధార్ కార్డులో ఒకసారి ముద్రించబడిన లింగం అనగా స్త్రీ లేదా పురుషుడు ను ఒక్కసారి మాత్రమే మార్చుకొగలం. దీని కొరకు మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లినా సరే లేదా మీ మొబైల్ లో అయినా సరే మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డుతో వేటి వేటికి లింక్(అనుసంధానం) కచ్చితంగా ఉండాలి:-
ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది మన జీవిత పయనంలో నిత్య అవసర వస్తువులలో మొదటి స్థానంలో ఉంది. అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటువంటి ఈ ఆధార్ కార్డు చాలా అంశాలతో లింకు(అనుసంధానం) పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా అవి ఏమిటి ఇప్పుడు చూద్దాం.
1. పాన్ కార్డు కు ఆధార్ కార్డు తో లింక్ చేసుకోవాలి:-
ప్రస్తుతం అత్యవసరంగా చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే అది మన పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం.మనలో ఇప్పుడు ఎక్కువ శాతం మందికి పాన్ కార్డు ఉంటుంది. కానీ చాలామందికి పాన్ కార్డుకు ఆధార్ తో కచ్చితంగా లింకు చేసుకోవాలని అన్న విషయం తెలియదు. భారత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తు వస్తుంది. ప్రస్తుతం వెయ్యి రూపాయల జరిమానా తో ఈ గడువును జూన్-30- 2023 వరకు పెంచడం జరిగింది. ఆలోపు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకొని ఎడల అటువంటి పాన్ కార్డులన్ని రద్దు అవుతాయి అని హెచ్చరికలు కూడా జారీ చేసింది. పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ online లో ఏ విధంగా చేయాలి?, చేసుకోకపోతే జరగబోయే నష్టాలు ఏమిటి? మొదలగు పూర్తి వివరాల కొరకు దిగువ లింక్ పై క్లిక్ చేయండి.
Link : Click Here
2.మొబైల్ నెంబర్ కు ఆధార్ లింక్ చేసుకోవాలి:-
మనము ఏ మొబైల్ నెంబర్ అయితే వాడుతున్నామో దానితో కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఆధార్ కు సంబంధించి చాలా సేవలు OTP ( ONE TIME PASSWORD) ఆధారంగానే జరుగుతూ ఉంటాయి. దాని కొరకు ఆధార్ కు మన మొబైల్ నెంబర్ ను కచ్చితంగా లింక్ పెట్టుకోవాలి. ఉదాహరణకు ప్రభుత్వ పథకాలు లేదా బ్యాంకు పనులు లేదా మరి ఏ ఇతర పనులు అయినప్పటికీ చేసుకోవాలి అన్న ఆధార్ కు మొబైల్ లింక్ ఉంటేనే జరుగుతాయి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కు లింకు కాని ఎడల మీకు దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్తే అక్కడ చేస్తారు.
3.మన బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు తో లింక్ చేసుకోవాలి:-
మనం మన నిత్యజీవితంలో బ్యాంక్ అకౌంట్ యొక్క అవసరాలు ఎంత ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి బ్యాంక్ ఎకౌంటు తో లావాదేవీలు చేయవలెనంటే కచ్చితంగా మన ఎకౌంటుకు ఆధార్ లింక్ ఉండాలి. లేకపోతే ఎటువంటి లావాదేవులు చేయలేము. అటువంటి ఖాతాలు రద్దు అవుతాయి. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాకపోతే మీకు ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉందో ఆ బ్యాంకుకు ఆధార్ నెంబర్ తో పాటు బ్యాంక్ ఖాతా పుస్తకం తీసుకువెళ్లినట్లయితే చేస్తారు.
4.ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు లింక్ చేసుకోవడం
భారతదేశ ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ వారు దేశంలో ఉన్న నకిలీ ఓట్లను, మరియు ఒక వ్యక్తికి వేరే వేరే చోట్ల ఓట్లు ఉండడం మొదలగు వాటి వలన వాటర్ లిస్టులో ఎక్కువమంది ఉంటారు. కానీ ఓటింగ్ పర్సంటేజ్ అంత స్థాయిలో అవ్వకపోవడం వలన ఓటర్ జాబితాను ప్రక్షాళన నిమిత్తం ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానించాలని నిర్ణయించారు. అయితే ఇది వ్యక్తి యొక్క ఇష్టం పై ఆధారపడి ఉంటుంది, ఇది బలవంతం గాని, తప్పనిసరిగాని కాదు. మీరు మీ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలి అనుకుంటే మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందో తెలుసుకొని ఆ పోలింగ్ కేంద్రానికి ఉన్న బూత్ లెవెల్ అధికారి(BLO) దగ్గరకు వెళ్తే వారు లింక్ చేస్తారు. లేదా మీరైనా సరే Voter helpline App ద్వారా ఆన్లైన్ చేసుకోవచ్చు.
పై వాటితోపాటు ఏదైనా ప్రభుత్వ పథకం అర్హత సాధించాలి అన్న మన ఆధార్ వివరాలు కరెక్ట్ గా ఉండాలి.
ఇంకెందుకు ఆలస్యం మీ ఆధార్ లో ఉన్న వివరాలు ఏ విధంగా మార్చుకోవాలో మీకు తెలియజేసాము కదా దాని ఆధారంగా మీరు మార్చుకోండి.
You Might Like This :
మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు సిబిల్ స్కోర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. : Click Here
Sankshema Calendar 2023-24 | ఏ నెలలో ఏ పథకాలు అమలు అవుతాయి తెలుసుకోండి. : Click Here