మీరు మీ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నారా?చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, లేకపోతే రాబోవు కాలంలో ఆధార్ కి సంబంధించిన అన్ని సేవలు నిలుపుదల చేసే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం మనం ఏ చిన్న పనికి వెళ్లాలన్నా ఆధార్ కార్డు మనకు అంత నిత్యవసరంగా మారిపోయింది. ఒక ప్రభుత్వ పథకం రావాలన్నా , ఏదైనా రాయితీ రావాలన్నా,ఏదైనా గుర్తింపు కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక నియమాన్ని జారీ చేసింది.అది ఏమిటంటే ఆధార్ కార్డు జారీ చేసి 10 సంవత్సరాలు దాటి , గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోకపోతే అటువంటి ప్రతి ఆధార్ కార్డును మీకు దగ్గరగా ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి చేసుకోవచ్చు. దీని కొరకు 50 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. అదేవిధంగా మీకు ఆన్లైన్ మీద మీకు అవగాహన ఉండి ఆన్లైన్లో చేసుకోగలిగితే కేవలం 25 రూపాయలు చెల్లించి చేసుకొనే అవకాశం ఉంది.కానీ ఎవరైతే సొంతంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటారో అటువంటి వారి కోసం మార్చ్-15-2023 నుండి జూన్-14-2023 వరకు ఉచితంగా చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి? దాని కొరకు ఏమి ఉండాలి?
ఏ వ్యక్తి అయితే ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటి అటువంటి వ్యక్తి గత పది సంవత్సరాలుగా తన ఆధార్ కార్డును ఒక్కసారి కూడా అప్డేషన్ చేసుకోని యెడల అటువంటి వ్యక్తి యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (Proof of Identity) మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (Proof of Address)ఈ రెండు డాక్యుమెంట్ యొక్క ప్రూఫ్స్ ను అప్లోడ్ చేయడమే ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్.
Note:- 1.ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (Proof of Identity) అంటే మీ ఆధార్ కార్డులో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా పేరు ఉండే ఏదైనా దిగువ తెలిపిన డాక్యుమెంట్స్ లో ఫోటోతో సహా ఉన్నటువంటి డాక్యుమెంట్.
2.ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (Proof of Address) అంటే మీ ఆధార్ కార్డులో మీ అడ్రస్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉన్నటువంటి దిగువ తెలిపిన డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒక డాక్యుమెంట్.
Note:- ఆధార్ డాక్యుమెంట్ online లో అప్డేట్ చేసేముందు మనం సిద్ధంగా ఉంచుకోవలసినవి.
1.Proof of Identity Document(2 MB లోపు JPEG,PNG, లేదా PDF format లో ఉండాలి)
2.Proof of Address Document(2 MB లోపు JPEG,PNG, లేదా PDF format లో ఉండాలి)
1.ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (Proof of Identity)కోసం ఏ డాక్యుమెంట్ ను Upload చెయ్యొచ్చు:-
- పాన్ కార్డ్ ,
- డ్రైవింగ్ లైసెన్స్,
- రేషన్ కార్డ్,
- ఓటర్ ఐడి కార్డ్,
- కిసాన్ ఫోటో పాసుబుక్,
- స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఫోటోతో ఉన్నది,
- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలతో జారీ చేయబడిన ఏదైనా ఫోటో ఐడెంటిటీ కార్డు ఉదాహరణకు NREGS జాబ్ కార్డు,labour card
- Indian Passport...Etc
ఇవి కాకుండా ఇంకా దిగువ తెలిపిన లింకులో PDF డాక్యుమెంట్ ఫైల్ ఇవ్వడం జరిగింది, Download Or Scroll చేసి పరిశీలించగలరని కోరుచున్నాము.
PDF DOWNLOAD LINK : Click Here
ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (Proof of Address)కోసం ఏ డాక్యుమెంట్లను Upload చెయ్యొచ్చు:-
మీ ఆధార్ లో వున్నటువంటి అడ్రస్ తో సరిపోలిన దిగువ తెలిపిన ఏదైనా డాక్యుమెంట్ లలో ఏదో ఒక document అప్లోడ్ చేయొచ్చు.
- Indian Passport,
- రేషన్ కార్డ్,
- ఓటర్ ఐడి కార్డ్,
- ఎలక్ట్రిసిటీ బిల్,
- ల్యాండ్ లైన్ ఫోన్ బిల్,
- వాటర్ బిల్,
- గ్యాస్ కనెక్షన్ పాస్ బుక్
ఇవి కాకుండా ఇంకా దిగువ తెలిపిన లింకులో PDF డాక్యుమెంట్ ఫైల్ ఇవ్వడం జరిగింది, Download చేసి పరిశీలించగలరని కోరుచున్నాము.
PDF DOWNLOAD LINK : Click Here
ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ ఆన్లైన్లో చేయు విధానం:-
1. ముందుగా దిగు తెలిపిన లింకుపై క్లిక్ చేయండి. లింక్ పై క్లిక్ చేయగానే లాగిన్(Login) అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేయండి.
LINK : Click Here
2. అప్పుడు స్క్రీన్ పైన కనిపించే Enter Aadhar దగ్గర మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న క్యాప్చ ను ఎంటర్ చేసి "Send OTP" బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు ఓటిపి వస్తుంది.
3. తరువాత Enter OTP దగ్గర మీ మొబైల్ కు వచ్చినటువంటి OTP సంఖ్యను ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.
4. లాగిన్ అవ్వగానే లాగిన్ పేజ్ పై కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. అందులో డాక్యుమెంట్ అప్డేట్ (Document Update) అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.
5. దానిపై క్లిక్ చేయగానే దిగు తెలిపిన విధంగా మెసేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ నెక్స్ట్ (Next)అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
6. తరువాత స్క్రీన్ పై How it Works? అనే మెసేజ్ చూపిస్తుంది దానికి దిగువున ఉన్న నెక్స్ట్(Next) బటన్ పై క్లిక్ చేయండి.
7. ఆ తరువాత స్క్రీన్ పై "Please Verify your demographic details" అని చూపుతూ మీ వివరాలు ఓపెన్ అవుతాయి. మీ వివరాలన్నీ సరిగ్గా ఉంటే దానికి దిగునా ఉన్న "I verify the about details are correct" ఆప్షన్ పైన సెలెక్ట్ చేసి నెక్స్ట్ (Next) బటన్ పై క్లిక్ చేయండి.
8. అప్పుడు ఓపెన్ అయిన స్క్రీన్ మీద దిగు తెలిపిన విధంగా కనిపిస్తాయి
Please upload Proof Of Identity (POI) document
Please upload Proof Of Address document
9. ముందుగా "Please upload Proof Of Identity document" సెక్షన్ ను ఎంపిక చేసుకొని ముందుగానే మీ మొబైల్ లో లేదా మీ సిస్టంలో పైన తెలిపిన విధంగా సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అనగా అక్కడ వచ్చే డ్రాప్ డౌన్ లో ఏవైతే డాక్యుమెంట్స్ (పైన తెలిపిన డాక్యుమెంట్లలో) ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయవలెను.
10. అప్పుడు మీరు ఏ డాక్యుమెంట్ అయితే ఎంచుకుంటారో దానికి సంబంధించి ఒక మెసేజ్ చూపిస్తుంది అక్కడ OK అని క్లిక్ చేయండి.
11. తరువాత "Continue To Upload" పై క్లిక్ చేసి అప్లోడ్ లో మీ డాక్యుమెంట్ను అప్లోడ్ చేయండి.
12. ఇదే పద్ధతిలో "Please upload Proof Of Address document" సెక్షన్ ను కూడా పూర్తి చేయండి.
13. అప్లోడ్ చేశాక కింద "I hereby give my consent" ఆప్షన్ ను సెలెక్ట్ చేసి Next పైన క్లిక్ చేయండి.
14. చివరగా మీకు Confirm చేయమని మెసేజ్ వస్తుంది. మీ వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే ఓకే పై క్లిక్ చేయండి.
15. తదుపరి Submit బటన్ పై క్లిక్ చేయండి.
16. దీంతో మీ డాక్యుమెంట్ అప్డేట్ పూర్తవుతుంది.అప్పుడు మీకు ఒక acknowledgement కూడా ఓపెన్ అవుతుంది.దానిని మీరు తదుపరి రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోండి.
- మీరు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నారా (సొంతంగా లేదా సచివాలయం ద్వారా అయినా) అయితే దాని స్టేటస్ తెలుసుకోవడానికి కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
- Link : Click Here
- మీరు డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకున్న తర్వాత వచ్చిన (Acknowledgement Slip)ఎకనాలజిమెంట్ స్లిప్ లో SRN లేదా URN నెంబర్ ఎంటర్ చేసి ఎంట్రీ క్యాప్చే (Captcha)వద్ద చూపించిన కోడి ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీ అప్లికేషన్ స్టేటస్ ను మీరు సులభంగా తెలుసుకోవచ్చు.
More Like This: