ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు కట్టుకోవాలనిది కాలం స్వప్నం. అయితే ఇల్లు కట్టుకునే ముందు మంచి స్థలాన్ని కొనుగోలు చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ప్రతి ప్రాంతంలో పుట్టగొడుగులు లాగా లేఅవుట్లు వేసి అందులో ఇళ్ల స్థలాలు పేరుతో అమ్ముతున్నారు. అయితే అవి అన్ని అనుమతులతో అమ్ముతున్నారా లేదా అనే విషయం చాలామందికి తెలియదు. రిజిస్ట్రేషన్ అవుతుంది కదా అనే ఒకే ఒక్క కారణంతో కొనుగోలు చేస్తున్నారు. తరువాత ఇల్లు కట్టుకునేటప్పుడు అనుమతుల కోసం గ్రామపంచాయతీకి లేదా మున్సిపాలిటీకి దరఖాస్తు చేసే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారందరి కోసం అసలు ఇంటి స్థలం కొనేముందు ఏమేమి చూడాలి? ఎక్కడ కొనాలి? అనే పూర్తిస్థాయి సమాచారం మీకోసం.
ఇంటి స్థలం కొనేముందు ఏమి చూడాలి?
లేఅవుట్లు ఎన్ని రకాలు అవి ఏమిటి?
అసలు లేఅవుట్లు అనేవి రెండు రకాలు ఒకటి అధికారిక లేఅవుట్లు, రెండు అనధికారిక లేఅవుట్లు. ఈ అధికారిక లేఔట్ లో ఇంటి స్థలం కొనుగోలు చేసినచో మనకు ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో ఉండవు. కానీ అనధికారిక లేఔట్ లో మనం ఇంటి స్థలాలను కొనుగోలు చేయకూడదు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య తేడాను చూద్దాం.
అధికారిక లేఅవుట్ అనగానేమి? దాని యొక్క పూర్తి వివరాలు ఏమిటి?
ఏదైనా లే అవుట్ అధికారిక లే అవుటుగా అనుమతులు పొందవలెనన్న దిగువ తెలిపిన నియమ నిబంధనలు పాటించాలి.
అధికారిక లే అవుట్ నియమాలు:-
1. ఏ స్థలంలో అయితే లేఅవుట్ వేస్తారో మొట్టమొదట ఆ స్థలాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ నుండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్షన్ చేయించాలి. దీనినే ల్యాండ్ కన్వర్షన్ లేదా నాలా అని మన వాడుక భాషలో చెప్తారు. దీనిని గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి వారు పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తారు.
Note:- చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ నాలా ఉత్తర్వులునే చూపించి ఇవే లేఅవుట్ అనుమతులు అని చెప్పి అందులో స్థలాలను అమ్ముతుంటారు అది తప్పు. నాలా ఉత్తర్వులు అనేవి లేఅవుట్ వేయడానికి మొట్టమొదటి ఉండవలసిన అంశం అంతే తప్ప లేఅవుట్ వేయడానికి అనుమతి చేసినట్టు కాదు.
2. లేఅవుట్ వేసిన మొత్తం స్థలంలో పది శాతం స్థలం భవిష్యత్తు అవసరాలు నిమిత్తం గ్రామపంచాయతీకి లేదా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. దానిని లేఅవుట్ ప్లాన్ లో కూడా పొందుపరచాలి.
3. DTCP అనుమతి పొందిన లేఅవుట్లలో అయితే మెయిన్ రోడ్లను 40 అడుగులు ఇంటర్నల్ రోడ్స్ 33 అడుగులు వేసి ఉండాలి. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు పొందిన లేఅవుట్లలో మెయిన్ రోడ్డు 60 అడుగులు ఇంటర్నల్ రోడ్స్ 40 అడుగులు వేసి ఉండాలి. కనీసం లేఔట్ మొత్తం 40 అడుగులు రోడ్లు ఉండాలి.
4.లేఅవుట్ మొత్తం డ్రైనేజీ వ్యవస్థ వేసి ఉండాలి.
5.లే అవుట్ లను అధికారికంగా డిస్ట్రిక్ట్స్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(DTCP) వారు లేదా ఏదైనా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఉదాహరణకు వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (VUDA) , శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (SUDA) మొదలగు సంస్థలు మాత్రమే అనుమతులు ఇస్తారు. చాలామంది గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయి అని చెప్పి లేఔట్లలలో ఇళ్ల స్థలాలు అమ్ముతున్నారు. అసలు గ్రామపంచాయతీకి లేఅవుట్లను అప్రూవ్ చేసే అధికారం లేదు. కేవలం లేఅవుట్ ప్రతిపాదనలను పరిశీలించి పైకి పంపించే అధికారం మాత్రమే ఉంది.
6. లేఅవుట్లో ఉన్న మొత్తం అన్ని వీధులకు వీధి దీపాల సదుపాయం కల్పించాలి.
7. నీటి సదుపాయం కొరకు తగు ఏర్పాట్లు చేయాలి.
8. కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి చాలా సంస్థలు పై నిబంధనలు తో పాటుగా అదనపు సౌకర్యాలు అనగా అందమైన పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ప్లేగ్రౌండ్స్ మొదలగు సౌకర్యాలు కూడా ఇస్తూ ఉంటారు. అది ఆ సంస్థ యొక్క నిర్ణయమే తప్ప తప్పనిసరి కాదు.
ఒక వ్యక్తి లేదా సంస్థ లేఅవుట్ వేయవలసిన సమర్పించాల్సిన దస్త్రాలు
1. లేఔట్ వేసే స్థలం యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు మరియు దానికి సంబంధించిన వివరాలు.
2. ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్.
3. E.C (Encumbrance Certificate)
4. రిజిస్టర్డ్ ఇంజనీరింగ్ లేదా సర్వేయర్ చేత గీయబడిన మాస్టర్ ప్లాన్
5. లేఅవుట్ వేసే స్థలానికి సంబంధించి రెవిన్యూ అధికారులు జారీ చేసిన స్థల సరిహద్దుల యొక్క డీ మార్కేషన్ సర్టిఫికేట్.
6. ఏదైనా లేఅవుట్ ఎయిర్ పోర్ట్ లేదా రక్షణ శాఖకు సంబంధించిన కార్యాలయాలకు(స్థలాలు) దగ్గరలో ఉన్నచో ఖచ్చితంగా ఎయిర్ పోర్ట్ అథారిటీ లేదా రక్షణ శాఖ వారి నుండి నిరభ్యంతర పత్రాలు పొందవలసి ఉంటుంది.
పైన తెలిపిన వివరాలన్నింటితో మీకు సంబంధించిన గ్రామపంచాయతీ లేదా మున్సిపాలిటీకి దరఖాస్తు చేసిన ఎడల వారు నియమ నిబంధనలు మేరకు అన్ని పరిశీలించి సంబంధిత ప్రదేశం ఏ పరిధిలోకి వస్తుందో అనగా డిటిసిపి లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి పంపించడం జరుగుతుంది. అప్పుడు డి టి సి పి లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు వచ్చి పరిశీలించి అన్ని నియమ నిబంధనలు మేరకు ఉన్నచో లేఅవుట్ వేయడానికి తాత్కాలికంగా లేఅవుట్ పర్మిషన్ నెంబర్ (L.P.NO) అనుమతులు మంజూరు చేస్తారు. అనుమతి చేసే క్రమంలో ముందుగా కొన్ని ప్లాట్లను మార్ట్ గేజ్ రూపంలో అనగా అమ్మడానికి వీలు కాకుండా వేరేగా ఉంచుతారు. ఒకవేళ ఇచ్చిన సమయంలోపల యజమాని లేఔట్ నియమ నిబంధనకు లోబడి అన్ని సదుపాయాలు కల్పించని యెడల ఈ మార్ట్ గేజ్ ప్లాట్ లను ప్రభుత్వం వారే తన పరిధిలోకి తీసుకొని అమ్మి అన్ని సదుపాయాలు కల్పిస్తారు.
ఇప్పటికే అనధికార లేఔట్ లో స్థలం కొనుగోలు చేసి ఉంటే పరిస్థితి ఏమిటి?
ఇప్పటికే ఎటువంటి అనుమతులు లేని లేఔట్లలో కొనుగోలు చేసిన ఎడల ప్రభుత్వం వారు ఎప్పుడైనా లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఆ నియమ నిబంధనల మేరకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కట్టి మన స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. దాని కొరకు ప్రభుత్వం వారు అవకాశాన్ని ఇవ్వాలి. అప్పటివరకు మనం ఏం చేయలేం.
అనధికార లేఅవుట్ లో ఒకవేళ మనం స్థలం తీసుకున్నట్లయితే
1. ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇంటికి ప్లాన్ ఎప్రువల్ అనేది గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ వారు అధికారికంగా ఇవ్వలేరు.
2. ఒకవేళ ఎటువంటి అనుమతులు లేకుండా ఇల్లు కట్టినచో దానికి కరెంటు మీటర్ గాని విద్యుత్ కనెక్షన్ గాని ఇవ్వరు.
3. అనధికారి లేఔట్ లో మీరు స్థలం కొన్నచో ఆ లేఔట్ కు ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు కల్పించారు అనగా రోడ్లు, డ్రైనేజీ సదుపాయం ,విద్యుత్ దీపాలు, నీటి సరఫరా మొదలుకొని ఏ సదుపాయాలు కూడా ఉండవు.
4. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం వారు కఠిన చర్యలకు దిగితే మనం కట్టిన భవన నిర్మాణాలను కూడా కూల్చే ప్రమాదముంది.
పైన తెలిపిన వివరాలన్నీ విషయపరిజ్ఞానానికి మాత్రమే అందించినవి, పూర్తి వివరాలు మీకు దగ్గరలో ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయానికి గాని లేదా మున్సిపాలిటీ అధికారులను గాని సంప్రదించిన తరువాతే తగు నిర్ణయం తెలుసుకోగలరు.
లే అవుట్ లకు సంబందించిన కొన్ని ప్రభుత్వ వెబ్ సైట్లు :
👉 D.T.C.P WEB SITE : Click Here
👉 VUDA (వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) : Click Here
👉 TUDA(తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) : Click Here
Super information
ReplyDeleteThank you very much
DeleteThanku Sir For Being a Part of Telugu Public...If You Like Our Website please Share it
DeleteThanku Sir For Being a Part of Telugu Public...If You Like Our Website please Share it
ReplyDelete