సిబిల్ స్కోర్ అంటే ఏమిటి ? What is CibilScore ?

మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు సిబిల్ స్కోర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.


CibilScore


మన నిత్యవసర జీవితంలో మనకు లోన్ ఏదో ఒక సమయంలో అయినా ఉపయోగపడుతుంది అయితే ఈ రుణం (Loan) కావాల్సినప్పుడు మనం బ్యాంకులకు వెళ్తాం అప్పుడు ఆ బ్యాంకు వారు ముందుగా మన సిబిల్ స్కోర్(CIBIL Score) లేదా క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తారు ఒకవేళ మన  CIBIL SCORE  బాగుంటే మనకు లోన్ అప్రూవ్ చేస్తారు లేదంటే కొట్టివేస్తారు. ఇలా ప్రతి బ్యాంక్ లో లోన్ ఇచ్చేముందు మన సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసే ఇస్తారు కాబట్టి మనం ఈ సివిల్ స్కోర్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

What is CIBIL Score Or Credit Score ? సిబిల్ స్కోర్ అంటే ఏమిటి ?

సిబిల్ స్కోర్ అన్న క్రెడిట్ స్కోర్ అన్నా ఒకటే అయితే సిబిల్ స్కోర్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ అనేది (CIBIL)" క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిట్" వారి ఇవ్వబడే మూడు అంకెల సంఖ్య. ఈ సిబిల్ స్కోర్ అనేది 300 - 900 వరకు ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు(Loans) వాటికి సంబంధించిన చెల్లింపు వివరాలను పరిగణలోకి తీసుకొని వాటి ఆధారంగా సిబిల్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి సంబంధించిన రుణాలు వాటి చెల్లింపు వివరాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు మరియు తీసుకున్న లోన్ తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ లో ఉన్న లావాదేవీలు ను పరిగణలోకి తీసుకొని అతనికి ఒక స్కోర్ ఇవ్వడం జరుగుతుంది అయితే మన సివిల్ స్కోర్ అనేది 900 కి దగ్గరగా ఉంటే మంచిది. అంటే ఈ స్కోర్ అనేది 750కు పైగా ఉంటే ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ బాగుంది అని అర్థం కనుక వారుకు బ్యాంకులు ద్వారా లోన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.

ఈ సిబిల్ స్కోర్(CIBILSCORE) తగ్గడానికి గల కారణాలు ఏమిటి ?

  • - తక్కువ సమయంలో ఎక్కువ లోన్స్ తీసుకోవడం వలన సిబిల్ స్కోర్ తగ్గుతుంది.
  • - ముఖ్యంగా మనం తీసుకున్న లోన్ చెల్లింపులు ఆలస్యం అయితే ఈ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.( Major Factor)
  • - Unsecured లోన్స్ అంటే చదువు, మరియు వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న లోన్స్ కూడా ఈ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపుతాయి.
  • - పాత క్రెడిట్ ఖాతాలు మూసి వేయడం వలన కూడా మీ యొక్క క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది

CIBIL Score తక్కువ ఉంటే కలిగే నష్టం ?

సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే బ్యాంకులో లోన్ ఇవ్వరు అని అర్థం కాదు. కొన్ని బ్యాంక్ పాలసీస్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అయితే మీరు గనుక సిబిల్ స్కోర్ ఎక్కువ కలిగి ఉంటే బ్యాంక్స్ కచ్చితంగా లోన్స్ ఇస్తాయి.  మరియు వడ్డీని కూడా తక్కువ ఛార్జ్ చేస్తాయి. అలాగే సిబిల్ స్కోర్ అనేది తక్కువ ఉంటే ఉంటే బ్యాంకులో ఒకవేళ లోన్ ఇచ్చిన అధిక మొత్తంలో మనం వడ్డీని చెల్లించవలసి వస్తుంది.

మీ సిబిల్ స్కోర్ ను పెంచాలంటే ఏం చేయాలి ?

  • - మనం తీసుకున్న లోన్స్ సకాలంలో పూర్తిచేస్తే మన సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
  • - మీ క్రెడిట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ లో కన్నా 30% తక్కువ వాడితే మీ సిబిల్ స్కోర్ పెరగొచ్చు.
  • - మీ క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ ను యాక్టివ్ గా ఉంచడం వలన మీ సిబిల్ స్కోర్ మెరుగు పడొచ్చు.
  • - ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో క్రెడిట్ ను తీసుకోకండి.
  • - మీ క్రెడిట్ రిపోర్ట్ ను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి ఎందుకంటే మొత్తం సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించుకోవడానికి. మీ సిబిల్ రిపోర్ట్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. మీరు ఏమైనా లోపాలు లేదా తప్పులు గమనించినట్లయితే వెంటనే సిబిల్ డిపార్ట్మెంట్ తో తనిఖీ చేయించవచ్చు.

Credit Card Ranges :

అద్భుతమైన క్రెడిట్ స్కోర్ (750 - 900):

మీ క్రెడిట్ స్కోర్ 750 మరియు 900 మధ్య ఉంటే, మీరు తగ్గిన వడ్డీ రేట్లతో రుణాలు పొందగలుగుతారు.

మంచి స్కోర్ (700 - 749) : 

మీ స్కోర్ 700 మరియు 749 మధ్య ఉంటే మీరు ఇప్పటికీ రుణాలను పొందవచ్చు, కానీ మీరు ఉత్తమ వడ్డీ రేట్లకు అర్హులు కాకపోవచ్చు.

Fair (650 - 699) :

మీ క్రెడిట్ స్కోర్ 650 మరియు 699 మధ్య ఉంటే, మీరు వాహనం లేదా గృహ రుణాల వంటి (Secured) రుణాలను పొందగలుగుతారు, కానీ మీరు వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డ్‌ల వంటి (Unsecured)రుణాలను పొందలేకపోవచ్చు.

Low (550 కంటే తక్కువ) :

మీ క్రెడిట్ స్కోర్ 550 కంటే తక్కువ ఉంటే, మీరు బ్యాంక్ రుణాల కోసం అధికారం పొందడంలో ఇబ్బంది పడవచ్చు.

క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండడం వలన ఉపయోగాలు ఏమిటి ?

మనం లోన్ తీసుకోవాలంటే ప్రతి బ్యాంక్ ముందుగా పరిశీలించేది క్రెడిట్ స్కోర్ కాబట్టి మనకు సులభంగా మరియు వేగంగా లోన్ పొందే అవకాశం ఉంటుంది.మరియు వడ్డీని కూడా ఎక్కువగా చార్జ్ చేయరు.

కింద ఇచ్చిన స్టెప్స్ ని అనుసరించి మీ సిబిల్ స్కోర్ ను ఆన్లైన్లో తనిఖీ చేసుకోండి  :

1. అధికారిక (Official Website) CIBIL వెబ్‌సైట్‌కి వెళ్లి, " Know Your Score " నీ  ఎంచుకోండి.

2. మీ పేరు, పుట్టిన తేదీ, నివాసం, ID Proof ,  క్రెడిట్ చరిత్ర మరియు ఇతర సంబంధిత సమాచారం వంటి సమాచారంతో ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించండి.

3. Form పూర్తి చేసిన తర్వాత , మీరు చెల్లింపు పేజీకి పంపబడతారు. మీరు ప్రీపెయిడ్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు మరియు నెట్ బ్యాంకింగ్‌తో సహా అనేక రకాల ఎంపికలను ఉపయోగించి చెల్లించవచ్చు. మీ క్రెడిట్ నివేదికను పొందడానికి, మీరు తప్పనిసరిగా CIBIL రూ.550 చెల్లించాలి.

4. విజయవంతమైన చెల్లింపు తర్వాత, మీరు లాగిన్ పేజీకి పంపబడతారు. CIBILతో మీ గుర్తింపును ధృవీకరించడానికి, మీరు మీ క్రెడిట్ చరిత్ర గురించిన 5 ప్రశ్నలకు సమాధానమివ్వాలి, వాటిలో కనీసం మూడింటికి తప్పక సరిగ్గా సమాధానం ఇవ్వాలి. తదుపరి 24 గంటలలో, మీ నివేదిక మీకు ఇమెయిల్(Mail) చేయబడుతుంది.

5. ప్రామాణీకరణ విఫలమైతే, మీరు అప్లికేషన్ యొక్క ( Hard Copy ) కాపీని పూర్తి చేసి CIBILకి మెయిల్ చేయవచ్చు. మీరు తర్వాత మెయిల్ ద్వారా నివేదికను అందుకుంటారు .

క్రెడిట్ స్కోర్ మరియు క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ను ఎలా పొందాలి ?

మీ సిబిల్ స్కోర్ లేదా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ ను పొందడానికి మీరు కచ్చితంగా భారతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థ అయినా సివిల్ ను సంప్రదించాల.మీరు క్రెడిట్ స్కోర్ మరియు క్రెడిట్ రిపోర్ట్ ను పొందేందుకు గరిష్టంగా 500 చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ కాపీను లోన్ తీసుకోవాలనుకుంటున్నా బ్యాంకుకు చెల్లింపు చేయవలసి ఉంటుంది.

మన క్రెడిట్ స్కోర్ ను ఉచితంగా పొందొచ్చా ?

మన క్రెడిట్ స్కోర్ మరియు మన క్రెడిట్ రిపోర్ట్ ను కొన్ని వెబ్సైట్స్ ఉచితంగా ఇస్తుంటాయి కానీ ఆ వెబ్సైట్స్ వారితో సైన్ అప్ చేయమని లేదా ఆ వెబ్సైట్ సభ్యుడిగా ఉండమని కోరుతాయి కనుక మనం ఇలాంటి వెబ్సైట్స్ ను నమ్మలేము.


మీరు మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే దిగువ ఇచ్చిన వెబ్సైట్లో ఉచితంగా తెలుసుకోవచ్చు :

https://www.bankbazaar.com/cibil/cibil-credit-report.html

https://www.cibil.com/freecibilscore

https://www.bajajfinserv.in/check-free-cibil-score


Also Read This :

Post a Comment

Previous Post Next Post