How To Change Aadhaar Card Name,Address and Date Of Birth in Online | మీ ఆధార్ కార్డులో మీ పేరును , పుట్టిన తేదీని మరియు చిరునామా ను ఇలా మార్చుకోండి | uidai govin

మీ ఆధార్ కార్డులో మీ పేరును , పుట్టిన తేదీని మరియు చిరునామా ను ఇలా మార్చుకోండి | Demographics Update Online.

aadhar card name change

మనలో చాలామందికి ఆధార్ లో మన వివరాలు ఏమైనా మార్చుకోవాలంటే ప్రతి విషయానికి ఆధార్ సెంటర్ కి వెళ్లడం, అక్కడ కాలం వృధా చేయడం చేస్తుంటారు. చాలామందికి మన మొబైల్ లోనే ఆధార్ చిరునామా,మన పేరు,మన పుట్టిన తేదీ మొదలగునవి మార్చుకోవచ్చు అన్న విషయం తెలియదు. అలాగే మన ఆధార్ తో మొబైల్ లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు, మన ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా పూర్తి వివరాలతో మీకోసం...

Note :  మీరు మీ చిరునామా ,మీయొక్క పేరు, మీయొక్క పుట్టిన తేదీ మార్చాలనుకుంటే ముందుగా మీ మొబైల్ నెంబర్ కు మీ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి.

మీ ఆధార్ కార్డు కు మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా మీ యొక్క ఈమెయిల్ లింకు అయ్యిందో  లేదో ఇలా తెలుసుకోండి :

1.ముందుగా దిగువ ఇచ్చిన లింకును క్లిక్ చేయండి.
Link : Click Here
2. మీకు అక్కడ "Verify Mobile Number" మరియు "Verify Email Address" అని చూపిస్తుంది. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి.

Verify Mobile Number in aadhaar


3. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ లేదా మీ మెయిల్ ఇచ్చి క్యాపిచ(captcha) ను ఎంటర్ చేయండి. తరువాత సెండ్ ఓటిపై ఓటిపి (Send OTP) పై క్లిక్ చేయండి.
4. మీరు ఓటిపి నీ ఎంటర్ చేసాక మీకు (Pop up Message) మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఒకవేళ మీ మొబైల్ కు ఆధార్ తో లింక్ అయిన యెడల చివరి మూడు అంకెలు చూపిస్తుంది. ఆదే విధంగా  మీ మెయిల్ కూడా లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.

మీ ఆధార్ కార్డులో మీ చిరునామా ఎలా మార్చుకోవాలో దిగువన చూడండి :

1. మీరు ముందుగా దిగువ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయాలి.
Link : Click Here
2. క్లిక్ చేసిన వెంటనే మీరు మీ యొక్క ఆధార్ నెంబరు మరియు Captcha ను ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక  సెండ్ ఓటీపీపై (Send OTP)  క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ కు ఓటిపి వస్తుంది దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
3.  లాగిన్ అయ్యాక మీకు అక్కడ అడ్రస్ అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరు ఎంచుకోండి.

aadhar card address change

4.  ఆ తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్లైన్ (Update Aadhaar Online ) అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే వేరే పేజీకి రి డైరెక్ట్ అవుతారు.

aadhar card address change

5.  అక్కడ "ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్" చూపిస్తుంది.దానిపై క్లిక్ చేసిన వెంటనే మరియొక పేజీకు వెళ్తారు.
6.  అక్కడ మీకు Name ,DOB, Gender, Address అని చూపిస్తుంది. మీరు అడ్రస్ ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ ను క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మీకు మీ పాత అడ్రస్ ను చూపిస్తుంది మరియు మీకు కొత్త అడ్రస్ ను అప్డేట్ చేసి నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి.

aadhar card address change


7.  మీ కొత్త చిరునామా ఇచ్చాక మీరు వ్యాలీడ్ ప్రూఫ్ ను అప్లోడ్ చేయాల్సి వస్తుంది వ్యాలీడ్ ప్రూఫ్ అనగా రేషన్ కార్డ్ ,బ్యాంక్ అకౌంట్....Etc
8.  మీరు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ పేజీకు వెళ్తారు.అక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా 50 రూపాయలు చెల్లించాలి.


Update Status Checking Link : Click Here

మీ ఆధార్ కార్డులో ఉన్న మీ పేరును మార్చాలనుకుంటే దిగువ చెప్పిన విధంగా ఫాలో అయ్యి మార్చుకోండి :

1. మీరు ముందుగా దిగువ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయాలి.
Link : Click Here
2. క్లిక్ చేసిన వెంటనే మీరు మీ యొక్క ఆధార్ నెంబరు మరియు Captcha ను ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక  సెండ్ ఓటీపీపై (Send OTP)  క్లిక్ చేయాలి.
3. లాగిన్ చేసిన తర్వాత "Name/gender/DOB & Address update " అనే ఆప్షన్ను ఎంచుకోండి.
4. ఇప్పుడు మీరు " Update Aadhaar Online" అనే ఆప్షన్ను ఎంచుకోండి.
5. అక్కడ మీకు Name ,DoB, Gender, Adress అని చూపిస్తుంది మీరు Name  ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ ను క్లిక్ చేయాలి. 
6. ఇప్పుడు మీరు మీ పేరును మార్చేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి. Ex:- SSC Marks Memo or Passport..... Etc
7. అప్లోడ్ చేసిన తర్వాత మీరు 50 రూపాయలు చెల్లించాలి.
8. పేమెంట్ చేసిన తరువాత (SRN) జనరేట్ అవుతుంది.దాన్ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకుంటే మీ యొక్క ఆధార్ అప్డేట్ స్టేటస్ ను తరువాత తెలుసుకోవచ్చు.


Update Status Checking Link : Click Here

మీ ఆధార్ కార్డులో ఉన్న మీ పుట్టిన తేదీను (DOB)  మార్చాలనుకుంటే దిగువ చెప్పిన విధంగా ఫాలో అయ్యి మార్చుకోండి :

1. మీరు ముందుగా దిగువ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయాలి.
Link : Click Here
2. క్లిక్ చేసిన వెంటనే మీరు మీ యొక్క ఆధార్ నెంబరు మరియు Captcha ను ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక  సెండ్ ఓటీపీపై (Send OTP)  క్లిక్ చేయాలి.
3. లాగిన్ చేసిన తర్వాత "Name/gender/DOB & Address update " అనే ఆప్షన్ను ఎంచుకోండి.
4. ఇప్పుడు మీరు " Update Aadhaar Online" అనే ఆప్షన్ను ఎంచుకోండి.
5. అక్కడ మీకు Name ,DoB, Gender, Adress అని చూపిస్తుంది మీరు DOB ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ ను క్లిక్ చేయాలి. 
6. ఇప్పుడు మీరు మీ DOB మార్చేందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి. Ex:- SSC Marks Memo or Passport..... Etc
7. అప్లోడ్ చేసిన తర్వాత మీరు 50 రూపాయలు చెల్లించాలి.
8. పేమెంట్ చేసేక (SRN) జనరేట్ అవుతుంది దాన్ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకుంటే మీ యొక్క ఆధార్ అప్డేట్ స్టేటస్ను తర్వాత తెలుసుకోవచ్చు.

Update Status Checking Link : Click Here


మీరు మీ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటే కింద స్టెప్స్ ని ఫాలో అయ్యి సులభంగా డౌన్లోడ్ చేసుకోండి :

1. ముందుగా దిగువ ఇచ్చిన లింకుపై క్లిక్ చేయండి.
Link : Click Here
2. క్లిక్ చేసిన వెంటనే దిగువ ఫోటోలో ఉన్నట్టు చూపిస్తుంది అక్కడ మీ ఆధార్ నంబర్ (or) Enrollment ID (or) Virtual I'd. ఇచ్చి క్యాప్చాని ఎంటర్ చేశాక " Send OTP" పై క్లిక్ చేయండి.

eaadhar download


3. ఓటీపీని ఎంటర్ చేశాక డౌన్లోడ్ ఆధార్ అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీ ఆధార్ ను (E aadhar)  సులభంగా డౌన్లోడ్ చేసుకోండి.
Note:-మీరు డౌన్లోడ్ చేసిన ఆధారు PASSWORD ప్రొటెక్షన్ తో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ యొక్క PASSWORD మీ పేరులో ముందు నాలుగు అక్షరాలు (Must Be Capital) మరియు మీ ఇయర్ అఫ్ బర్త్ (Year Of Birth).

ఉదాహరణకి :

Ex :- Abc.Sai
DOB : 23/06/1989
Password: ABC1989

Ex2 :- Ab.Sai
DOB : 23/06/1989
Password: AB.1989          ("Dot "." also consider")

మీ ఆధార్ యొక్క అప్డేట్ హిస్టరీ అంటే ఏమిటి? అది తెలుసుకోవాలనుకుంటే దిగువ స్టెప్స్ ఫాలో అయ్యి సులభంగా తెలుసుకోండి.


ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మనం మన ఆధార్ జారీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని మార్పులు అయితే చేస్తున్నామో తేదీల వారీగా మొత్తం వివరాలు ఆధార్ అప్డేట్ హిస్టరీలో వస్తాయి. ఉదాహరణకు మీరు పుట్టిన తేదీ మార్చి ఉన్న యెడల మొదటి పుట్టిన తేదీ ఎప్పుడు ఉంది రెండో పుట్టిన తేదీ ఏ తేదీన మార్చారు ఏ తేదీకి మార్చారు మొదలగు మొత్తం వివరాలు ఓపెన్ అవుతాయి. అదేవిధంగా మార్పు చేసిన అన్ని వివరాలు ఓపెన్ అవుతాయి. మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఏ విధంగా తెలుసుకోవాలో దిగువన వివరించబడింది.

1. ముందుగా దిగువ ఇచ్చిన లింక్ ని క్లిక్ చెయ్యండి.
2. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసిక Captcha ను ఎంటర్ చేయండి. తర్వాత సెండ్ ఓటిపి (Send OTP) పై క్లిక్ చేయండి.

aadhar history


3. OTP ను ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ యొక్క ఆధార హిస్టరీ కనపడుతుంది.

Valid Documents For Aadhaar Demographics Upadate : 

                                                ---------- Scroll Down ---------




Also Read This :

Post a Comment

Previous Post Next Post