PAN - Aadhaar లింక్ పై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

pan aadhar link


  భారతదేశ ప్రభుత్వం పాన్ కార్డుకు ఆధార్ లింకును చేసుకోమని ఉచితంగా కొంతకాలం క్రితం అవకాశాన్ని ఇచ్చింది అయితే చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. ప్రస్తుతం పాన్ కార్డుకు ఆధార్ వెయ్యి రూపాయల జరిమానా తో లింక్ చేసుకోవడానికి అవకాశాన్ని మార్చి 31 వరకు అవకాశాన్ని ఇచ్చినప్పటికీ చాలామంది ఇంకా లింక్ చేసుకోకపోవడం తో మరలా ఆ గడువును జూన్ 30 వరకు పెంచడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పటికీ ఇంకా ఎవరైతే ఆధార్ కార్డుతో ప్యాన్ లింక్ చేసుకోలేదో త్వరగా చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.

మన ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింకింగ్ గడువు జూన్ 30 వరకు పొడిగించబడింది. తరుణంలో పాన్, ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలి.. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇంకా లింక్ చేయని యెడల జరిగే పరిణామాలు తెలుసుకోవడానికి స్క్రోల్ చేయండి

 

పాన్ కార్డ్‌కు ఆధార్‌‌ సంఖ్యను అనుసంధానం చేసుకునేందుకు June 30 చివరి గడువుగా ఉంది. డెడ్‌లైన్ దాటితే రూ.10వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు పాన్‌కు ఆధార్ లింక్ చేసుకోకపోతే.. విధానాల ద్వారా క్షణాల్లో మీరే చేసుకోవచ్చు.

 

మన దేశంలో (అస్సాం, జమ్మూ, కాశ్మీర్, మేఘాలయ )వంటి రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పాన్, ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలని, అన్ లింక్ చేయబడిన ఖాతాలన్నీ నిలిపేస్తామని మరియు 50,000 దాటిన ప్రతీ Transaction కు 10,000 జరిమాన పడ్తుంది అని భారత ప్రభుత్వం ప్రకటించింది.

 

మీ పాన్‌ నెంబర్‌తో ఆధార్‌ లింక్‌ అయిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం కింద వివరాలను చూడండి :-

 

Step 1:- ముందుగా కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status

 

Step 2:- చేసిన వెంటనే వచ్చిన బ్లాంక్స్ లో మీ ఆధార్ & పాన్ నంబర్స్ నీ ఇవ్వండి. ఎంటర్ చేసిన వెంటినే "View Link Aadhar Status"  పై క్లిక్ చెయ్యండి.

 

Step 3:- మీకు కింద చూపించి నట్లు వస్తే. మీ ఆధార్ పాన్ తో లింక్ అయ్యినటు

 

pan aadhar link


 ఒకవేళ అలా కాకుండా దిగువ చూపిన విధంగా వస్తే మీ పాన్ కార్డుకు ఆధార్ లింకు అవ్వలేదు. అప్పుడు పాన్ కార్డుకు ఆధార్ కార్డు ఏ విధంగా లింక్ చేయాలో దిగువన వివరంగా తెలియజేయడమైనది.

 

 

pan aadhar


 

 

పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేసుకోవాలో అనేది కింద స్టెప్స్ ద్వారా తెలుసుకోగలరు:-

 

పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలి అని అనుకుంటే ముందుగా మీరు చేయాల్సిన పనులు (2) :-

 

1.NSDL పోర్టల్‌లో రుసుము చెల్లింపు చెయ్యాలి

 

Step 1:- కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి "Challan no./ITNS 280 under the Non-TDS/TCS category" ఎంచుకోండి.

 

https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp

 

nsdl

 

Step 2:- తర్వాత పేజీలో  "head ‘(0021)’ and then ‘(500)’ " ఎంచుకోండి


nsdl




 

Step 3:- చెల్లింపు విధానాన్ని ఎంచుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేయండి మరియు అవసరమైన వివరాలను నమోదు చేయండి (మీ PAN వంటివి, అసెస్‌మెంట్ ఇయర్ కోసం 2023-24, చిరునామా మొదలైనవి ఎంచుకోండి)

 


 


 

Step 4:- చెల్లింపు చేయడానికి కొనసాగండి మరియు పాన్-ఆధార్ లింక్ అభ్యర్థనను సమర్పించడానికి తదుపరి దశలను అనుసరించండి. అభ్యర్థనను సమర్పించే ముందు 4-5 రోజులు వేచి ఉండటం మంచిది.

 

2.ఆధార్ నంబర్ మరియు పాన్ లింక్ కోసం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ అభ్యర్థనలను(Request) సమర్పించండి

 

గమనిక:- పైన చెప్పినట్టు NSDL కు రుసుము చెల్లింపు చేసిన రెండు - మూడు రోజులు తర్వాత స్టెప్స్ ను చేయవలెను.

 

Method 1:- SMS ద్వారా ఆధార్ నంబర్ మరియు పాన్ లింక్ చేయడం.

 

ఇప్పుడు మీరు మీ ఆధార్ మరియు పాన్‌లను SMS ద్వారా లింక్ చేయవచ్చు. SMS ఆధారిత సదుపాయాన్ని ఉపయోగించి, పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్‌ను వారి పాన్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. ఇది 567678 లేదా 56161కి SMS పంపడం ద్వారా చేయవచ్చు. కింది ఫార్మాట్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 567678 లేదా 56161కి SMS పంపండి:

 

UIDPAN<SPACE><12 digit Aadhaar><Space><10 digit PAN>

 

Example: UIDPAN 123456789123 KSPLM2124P

 

Method 2:

 

Step 1:- ముందుగా కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయాలి

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar

 

Step 2:- చేసిన వెంటనే వచ్చిన బ్లాంక్స్ లో మీ ఆధార్ & పాన్ నంబర్స్ నీ ఇవ్వండి. ఎంటర్ చేసిన వెంటినే "Validate "  పై క్లిక్ చెయ్యండి.


 



 

గమనిక:- పైన చెప్పినట్టు NSDL కు రుసుము చెల్లింపు చేసిన రెండు - మూడు రోజులు తర్వాత స్టెప్స్ ను చేయవలెను.

 

Step 3:-పాన్ మరియు ఆధార్‌ని ధృవీకరించిన(Validate) తర్వాత, మీకు పాప్-అప్ సందేశం కనిపిస్తుంది “Your payment details are verified”. Click the ‘Continue’ button to submit the ‘Aadhaar link’ request.

 




 

Step 4:-అవసరమైన వివరాలను నమోదు చేసి, 'లింక్ ఆధార్' బటన్‌ను క్లిక్ చేయండి.

 






 

Step 5:- మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన 6-అంకెల OTPని నమోదు చేసి, ధృవీకరించండి.

 





 

మీ అభ్యర్థన స్క్రీన్‌పై Success Message నీ చూడండి. మీరు ఇప్పుడు మీ ఆధార్-పాన్ లింక్ స్థితిని తనిఖీ చేయవచ్చు.

 


pan aadhar



 

 

  Aadhar - Pan Link చేసుకోకపోతే మీ పాన్ కార్డు ఆ తరువాత పనిచేయడం మానేస్తుంది. అలా పనిచేయకపోతే

1. ఒకవేళ మీరుభవిష్యత్తులో విదేశాలకు వెళ్లాలనుకుంటే మీరు పాస్పోర్టుకు దరఖాస్తు చేయలేరు.

2.మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉన్నట్లయితే మీరు ఎటువంటి ట్రేడింగ్ను చేయలేరు. మరియు ట్రేడింగ్ ఎకౌంట్ ఉన్నట్టయితే ఆ ఎకౌంటు పనిచేయడం మానేస్తుంది అందువలన స్టాక్ మార్కెట్లో మీ డబ్బును పెట్టుబడిగా

పెట్టలేరు.

3. ప్రభుత్వ పథకాలలో మీ డబ్బుని పెట్టుబడిగా పెట్టలేరు.

4. బ్యాంకులో  పెద్ద మొత్తంలో  FD లేదా సేవింగ్ చేద్దాం అనుకుంటే 50,000 రూ కు మించి చేయలేరు.

5. బ్యాంకు నుండి 50 వేల కన్నా ఎక్కువ డబ్బును Withdraw కూడా చెయ్యలేరు.

6.మీరు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తే. Income Tax Return ఫైల్ చెయ్యలేరు.

7. TDS నగదు ఎక్కువ కట్ అవుతుంది.

 ఇన్ని సమస్యలు ఎదుర్కోవడం కంటే ఆధార్ కు పాన్ కార్డు లింక్ చేసుకోవడం ఉత్తమం కనుక ఇప్పుడే మీరు వెంటనే మీ ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేసుకోండి.

 

 

 















Post a Comment

Previous Post Next Post