ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ రాష్ట్రాల్లో ట్రాఫిక్ చలానా (eChallan) ఎలా కట్టాలో తెలుసుకోండి .
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల తెలుగు ప్రజలు తమ వాహనాలపై వెళ్తున్నప్పుడు పోలీసులు ఫోటో తీసే దృశ్యాలు చాలా చూస్తూ ఉంటారు. అంటే మనం ఏదైనా నియమ నిబంధనలు ఉల్లంఘించినచో అలా ఫోటో తీసి ఆన్ లైన్ లో ఫైన్ వేయడం జరుగుతుంది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఎప్పుడైనా పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్న సందర్భంలో మీ వెహికల్ నెంబర్ పై ఆన్లైన్ లో చెక్ చేసి మీ వాహనం పై ఫైన్ ఉందని,దానిని మీరు చెల్లించాలి అని అనడం మనం చూస్తూ ఉంటాం..అయితే మీ వాహనం పై ఎంత ఫైన్ ఉందో మీరే మీ మొబైల్ లో చూసుకోవచ్చు.అది ఎలాగో STEP BY STEP ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ వారికి :-
STEP 1 :- ముందుగా ఆంధ్ర ప్రదేశ్ వారు దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చేయ్యండి.
STEP 2 :- సైట్ ఓపెన్ చేయగానే దిగువ చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.అందులో "Enter Vehicle Number" అన్న చోట మీ వెహికల్ No ని ఎంటర్ చేసి దాని దిగువున ఉన్న Captcha ను ఎంటర్ చేసి Search బటన్ పై క్లిక్ చెయ్యండి.
STEP 3 :- SEARCH బటన్ పై క్లిక్ చేయగానే దిగువ చూపిన విధంగా మీ వాహనం పై ఎన్ని సార్లు, ఎంతెంత fine లు, ఏ కారణం చేత పడి వున్నాయో చూపిస్తుంది . దానిలోనే VIEW MORE అనే దాని పై క్లిక్ చేస్తే వేసిన ఫైన్ ఏ పోలీస్ స్టేషన్ పరిది లో వేశారు , ఎప్పుడు వేశారు మొదలగు వివరాలు చూపిస్తుంది .
STEP 4 :- చివరగా మీ VEHICLE పై ఉన్న FINE ను ఆన్లైన్ లో కట్టాలి అనుకుంటే PAY అనే ఆప్షన్ పై క్లిక్ చేసి PHONE PE, GOOGLE PAY లేదా ఇతర ONLINE విధానం లో చెల్లించ వచ్చు.
తెలంగాణ రాష్ట్రం లో వారికి :
STEP 1 :- ముందుగా తెలంగాణ వారు దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చేయ్యండి.
https://echallan.tspolice.gov.in/publicview/
STEP 2 :- సైట్ ఓపెన్ చేయగానే దిగువ చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.అందులో " Vehicle No" అన్న చోట మీ వెహికల్ No ని ఎంటర్ చేసి దాని దిగువున ఉన్న Question కి సమాధానం ఉదాహరణకి 6+7= అని వుంటే మీరు 13 అని సమాధానం అక్కడ వున్న బాక్స్ లో ఎంటర్ చేసి GO బటన్ పై క్లిక్ చెయ్యండి.
STEP 3 :- GO బటన్ పై క్లిక్ చేయగానే దిగువ చూపిన విధంగా మీ వాహనం పై ఎన్ని సార్లు, ఎంతెంత fine లు, ఏ కారణం చేత పడి వున్నాయో, ఏ పోలీస్ స్టేషన్ పరిది చూపిస్తుంది.దానిలోనే చివరకు Click for Image అనే దాని పై క్లిక్ చేస్తే మీ వాహనం యొక్క ఫోటో చూపిస్తూ ఏ కారణం తో ఫైన్ వేశారో కారణం చూపిస్తుంది.
STEP 4 :- చివరగా మీ VEHICLE పై ఉన్న FINE ను ఆన్లైన్ లో కట్టాలి అనుకుంటే "Choose Your Mode of Payment" అనే ఆప్షన్ కి దిగువున ఉన్న ఏదైనా online payment mode ని ఎంపిక చేసుకొని మీ fine ను కట్టుకోవచ్చు.
చూశారు కదా ..మీ VEHICLE పై ఎంత ఫైన్ వుందో కాబట్టి ఇకపై మీ వాహనం పై వెళ్ళే టప్పుడు అన్ని RULES పాటిస్తూ సురక్షిత ప్రయాణం చెయ్యాలని కోరుకుంటున్నాం.ఒకవేళ మీ వాహనానికి ఎటువంటి ఫైన్లు లేనియెడల భవిష్యత్తులో కూడా ఫైన్ పడకుండా జాగ్రత్త వహించగలరని కోరుచున్నాము.
ప్రభుత్వ పథకాలు మరియు నిత్యజీవితంలో ఉపయోగకరమైన పోస్టుల కొరకు దిగు లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Telegram : https://t.me/telugupublic1
Whatsapp : https://chat.whatsapp.com/EFGEJQYQuTj2mOJHZQfaH5
You Might Like This :
మీరు మీ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నారా?చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, లేకపోతే రాబోవు కాలంలో ఆధార్ కి సంబంధించిన అన్ని సేవలు నిలుపుదల చేసే ప్రమాదం ఉంది. : Click Here
Sankshema Calendar 2023-24 | ఏ నెలలో ఏ పథకాలు అమలు అవుతాయి తెలుసుకోండి. : Click Here
How to change pre-selected themes in vibrant Gram Sabha? : Click Here
2023-24 GPDP లో వచ్చిన మార్పులు ఏమిటి? GPDP ONLINE నమోదు కు ముందు ఏమి సిద్దం చేసుకోవాలి? : Click Here