గ్రామ వార్డు వాలంటీర్ లను తొలగించే విధానం
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతనంగా గ్రామ వార్డు సచివాలయాలతో పాటు గ్రామాలలో 50 ఇళ్లకు, పట్టణాల లో 70-100 ఇళ్లకు ఒక వాలంటరీ వ్యవస్థను స్థాపించడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే, వాలంటీర్లు ఏదైనా తప్పు చేస్తే వారి తొలగింపునకు సరైన మార్గదర్శకాలు ఇప్పటివరకు లేవు, అయితే ప్రభుత్వం ఇటీవల వారి తొలగింపునకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేసింది.వాటి ప్రకారం దిగు తెలిపిన విధంగా వాలంటీర్లను తొలగించవచ్చు.
ఎవరైనా వాలంటీర్ ని తొలగించాలి అన్న దిగువ తెలిపిన అంశాలలో ఏదో ఒక అంశం రుజువు కావాలి.
1. Corruption (అవినీతి)
2. Irresponsible And Not Discharging Services (సచివాలయ సేవలను అమలు చేసే క్రమంలో నిర్లక్ష్యం వహించినచో లేదా ప్రజలకు సరైన విధంగా అందించని సందర్భం.)
3. Improper Civic Behaviour (ప్రజలతో అమర్యాదగా నడుచుకున్న ఎడల)
4. Moral Turpitude (విధి నిర్వహణలో నైతిక విలువలు పాటించకపోవడం)
5. Committed Any Irregularities (ఏదైనా అక్రమాలకు పాల్పడినచో)
ఎవరైన వాలంటీర్ ను తొలగించాలి అన్న పైన తెలిపిన 5 అంశాలలో ఏ ఒక్క అంశం పైన ఫిర్యాదు అందినచో దిగు తెలిపిన పద్ధతుల్లో వాలంటీర్ తొలగించవచ్చు.
1. ఎవరైనా వాలంటీర్ పని తీరుపై పైన తెలిపిన ఐదు అంశాల ప్రాప్తికి ఫిర్యాదు అందినచో పంచాయతీ కార్యదర్శి / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు దిగువ తెలిపిన విధంగా ఎంక్వయిరీ చేసి తమ ఎంక్వైరీ రిపోర్టును సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి/మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కి అందించాల్సి ఉంటుంది.
a. పంచాయతీ కార్యదర్శి / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు ఫిర్యాదు అందిన వాలంటీర్ పై ఏ రోజు ఏ సమయానికి ఎంక్వయిరీ కి వెళ్తున్నారో తెలియచేస్తూ ఆరోజు ఎంక్వైరీ కి హాజరు కమ్మని ఆ వాలంటీర్ కి నోటీసు జారీ చేయవలెను.
b.పంచాయతీ కార్యదర్శి / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు పద్ధతి ప్రకారం విచారణ చేసి ఫిర్యాదుదారుని స్టేట్ మెంట్ తో పాటు సాక్ష్యాలు (ఏమైనా వున్న యెడల) ముందుగా రికార్డ్ చేయాలి, ఆ వివరాలు సంబంధిత వాలంటీర్ కి తెలియజేసి దానిపై వాలంటీర్ యొక్క స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేయాలి.
c. ఇరువురి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసి దానితో పాటు పంచాయతీ కార్యదర్శి / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు తమ యొక్క అభిప్రాయాలను జత చేసి ఎంక్వైరీ రిపోర్టును సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి/మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కి అందించాల్సి ఉంటుంది.
d.పంచాయతీ కార్యదర్శి / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు అందించిన విచారణ నివేదిక ఆధారంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి/మున్సిపల్ కమిషనర్ వారు సంబంధిత వాలంటీర్ ను తొలగించాలి అని అభిప్రాయానికి వస్తే తొలగింపు ఉత్తర్వులను జారీ చేయవచ్చు.
తొలగించిన వాలంటీరుకు రివ్యూ కు అప్పీల్ చేసే అవకాశం కల్పించుట:-
ఎవరినైనా వాలంటీర్ ను విధుల నుంచి తొలగించిన తరువాత ఆ వాలంటీర్ తనను తొలగించిన విధానంపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా దిగువ తెలిపిన సభ్యులతో కూడిన కమిటీ ముందు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
కమిటీ సభ్యులు :-
1. రెవిన్యూ డివిజనల్ అధికారి (RDO)- చైర్మన్
2. డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (DLDO)- మెంబర్ కన్వీనర్
>3. డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ (DLPO)- మెంబర్
4. రీజినల్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుండి ఒక ప్రతినిధి - మెంబర్
పైన తెలిపిన కమిటీ కు వచ్చిన దరఖాస్తులను 15 రోజుల లోపల విచారించి ఒక నిర్ణయం తీసుకొని తగు ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఆ కమిటీ వాలంటీర్ తొలగింపును తప్పుగా భావిస్తే తిరిగి ఆ వాలంటీర్ ను విధులలో చేర్చుకోవడానికి తగు ఉత్తర్వులు కూడా జారీ చేయవచ్చు.
పూర్తి ఉత్తర్వుల కొరకు దిగువ లింక్ పై క్లిక్ చేయండి