ప్రతి సంవత్సరం చేసిన విధంగానే ఈ సంవత్సరం(2023-24) గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(GPDP)ఆన్లైన్ వెబ్ పోర్టల్ నందు నమోదు చేయుట ప్రారంభం అయినది. అయితే ప్రతి సంవత్సరం మనం చేసిన విధానానికి ఈ సంవత్సరం కొన్ని మార్పులు చేయడం జరిగింది. ముందుగా ఆ మార్పులు ఏమిటో చూద్దాం. తరువాత GPDP ఆన్లైన్ వెబ్ పోర్టల్ నందు నమోదు చేయడానికి ముందుగా మనం సిద్ధం చేసుకోవాల్సిన అంశాలను కూడా పరిశీలిద్దాం.
2023-2024 సంవత్సరం కి సంబంధించి G.P.D.P. ఆన్లైన్ చేయుటకు మారిన నియమావళి:-
I. ఈ సంవత్సరం GPDP లో వచ్చిన ప్రధానమైన మార్పు ఏమిటంటే 15వ ఆర్థిక సంఘం నిధులలో UNTIED నిధుల కింద చూపించిన మొత్తం డబ్బులలో సగం లేదా దాని కంటే ఎక్కువ మొత్తం మీరు ఎంపిక చేసుకున్న థీమ్స్(దిగువన THEMES గురించి వివరించ బడింది) కి కేటాయించాలి.అదేవిధంగా ప్రతి థీమ్ కి ముందుగానే కొన్ని పనులు(ACTIVITIES) కేటాయించబడ్డాయి. ఆ పనులలో కచ్చితంగా సగం కంటే ఎక్కువ పనులు UNTIED GRANT కింద నమోదు చేయాలి. అప్పుడే ప్లాన్ ముందుకు వెళుతుంది.
ఉదాహరణకు:- మీ గ్రామపంచాయతీ లో UNTIED GRANTS Rs.100 ఉన్నాయి అనుకుందాం.మీ గ్రామపంచాయతీ "Water Sufficient Village" థీమ్ నీ ఎంపిక చేసుకుంది అనుకుందాం.ఈ థీమ్ లో మొత్తం 64 పనులు(ACTIVITIES) online లో చూపిస్తాయి.అందులో సగం కంటే ఎక్కువ అనగా 32 కంటే ఎక్కువ పనులను గుర్తించి మీ UNTIED GRANTS లో సగం అమౌంట్ లేదా అంత కంటే ఎక్కువ అనగా Rs.50 లేదా అంత కంటే ఎక్కువ డబ్బులు కేటాయించాలి.అప్పుడే ప్లాన్ ముందుకు వెళ్తుంది.
THEMES అంటే ఏమిటి?
ఈ సంవత్సరం జిపిడిపి(GPDP) మొత్తం Sustainable Development Goals అనగా SDG గోల్స్ ఆధారంగానే చేయవలసి ఉంటుంది.SDG గోల్స్ అనగా మొత్తం 17 రకాల గోల్స్ ని 9 థీమ్స్ (THEMES) కింద విడగొట్టడం జరిగింది. అందులో ప్రతి థీమ్ కింద ముందుగానే కొన్ని పనులను(ACTIVITIES) కేటాయించడం జరిగింది. అందులోనే ఎంపిక చేసుకొని GPDP పూర్తి చేయాల్సి ఉంటుంది. అవి
THEME 1:-
పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధుల గ్రామం(Poverty Free Village). ఈ Theme లో మొత్తం 42 పనులు(ACTIVITIES) online లో చూపిస్తున్నాయి.
THEME 2:-
ఆరోగ్యకరమైన గ్రామం(Healthy Village).ఈ Theme లో మొత్తం 60 పనులు(ACTIVITIES) online లో చూపిస్తున్నాయి.
THEME 3:-
పిల్లల స్నేహపూర్వక గ్రామం(Child Friendly Panchayat).ఈ Theme లో మొత్తం 65 పనులు(ACTIVITIES) online లో చూపిస్తున్నాయి.
THEME 4:-
నీటి సమృద్ధి కలిగిన గ్రామం(Water Sufficient Village).ఈ Theme లో మొత్తం 64 పనులు(ACTIVITIES) online లో చూపిస్తున్నాయి.
THEME 5:-
పరిశుభ్రమైన మరియు హరిత గ్రామం(Clean And Green Village).ఈ Theme లో మొత్తం 82 పనులు(ACTIVITIES) online లో చూపిస్తున్నాయి.
THEME 6:-
స్వయం సమృద్ధితో మౌలిక సదుపాయాల గల గ్రామం(Village With Self Sufficient Infrastructure).ఈ Theme లో మొత్తం 135 పనులు(ACTIVITIES) online లో చూపిస్తున్నాయి.
THEME 7:-
సామాజిక న్యాయం మరియు సామాజికంగా భద్రత కలిగిన గ్రామం(Socially Secured And Socially Just Village).ఈ Theme లో మొత్తం 42 పనులు(ACTIVITIES) online లో చూపిస్తున్నాయి.
THEME 8:-
సుపరిపాలన కలిగిన గ్రామం(Village With Good Governance).ఈ Theme లో మొత్తం 54 పనులు(ACTIVITIES) online లో చూపిస్తున్నాయి.THEME 9:-
మహిళా స్నేహపూర్వక గ్రామం(Women Friendly Village).ఈ Theme లో మొత్తం 50 పనులు(ACTIVITIES) online లో చూపిస్తున్నాయి.
ప్రతి గ్రామపంచాయతీ 2022 -23వ సంవత్సరంలో వైబ్రేంట్ గ్రామ సభలను నిర్వహించి పైన తెలిపిన తొమ్మిది themes లో ప్రతి గ్రామపంచాయతీ కొన్ని THEMES ను ఎంపిక చేసుకొని సంకల్పాన్ని తీసుకొని ONLINE చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం GPDP యాక్టివిటీ(పని) నమోదు సందర్భంలో ఆ పని మొట్టమొదటగా ఈ తొమ్మిది థీమ్స్ లో దేనికి సంబంధించినది అయితే ఆ THEME ను ఎంపిక చేసుకోవాలి. థీమ్స్ లో మీరు సంకల్పం తీసుకున్న థీమ్స్ పచ్చ రంగులో ఉంటాయి.
NOTE :- ప్రతి గ్రామపంచాయతీ రెండు లేదా అంతకంటే ఎక్కువ థీమ్స్ ని ఎంపికగా చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు ఆ థీమ్స్ కి కేటాయించిన మొత్తం పనులలో సగం పనులు కచ్చితంగా చూపించాలి. కనుక అది చాలా కష్టంతో కూడుకున్న పని అయితే ప్రస్తుతం ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ థీమ్స్ ఎంపిక మార్చుకునే అవకాశం ఇప్పటికీ ఉంది.ప్రధానంగా ఏదో ఒక్క THEME ని ఎంపిక చేసుకొని దానికి UNTIED నిధులు లను సగం కంటే ఎక్కువ కేటాయించినచో జిపిడిపి ప్లాన్ సులభంగా చేయగలరు.
ప్రస్తుతం VIBRANT గ్రామ సభ లో ఉన్న THEMES ను మార్చు కోవడానికి 👉 CLICK HERE
II.రెండవ మార్పు:- E-Gramaswaraj Portal నందు login అవ్వగానే ముందుగా Fund/Resource Envelope నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే 15వ ఆర్థిక సంఘం నిధులను మీ పంచాయతీకి సంబంధించి Tied మరియు Untied Grant లు ముందుగానే నమోదు చేసి ఉంటాయి. మిగిలిన నిధులు అనగా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు మరియు స్టేట్ ఫైనాన్స్ అదేవిధంగా పంచాయతీ సాధారణ నిధులు ఖాళీగా ఉంటాయి. ప్రతి సంవత్సరం 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన వివరాలు అనగా Tied మరియు Untied నియమ నిబంధనల మేరకు పనులను నమోదు చేస్తే ఆ సంవత్సరం జిపిడిపి పూర్తి చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం ప్రతి గ్రాంట్ నందు సంబంధిత శాఖ ద్వారా వివరాలు తెచ్చుకొని ఆ శాఖ బడ్జెట్ నమోదు చేసి ఆ శాఖ పనులు నమోదు చెయ్యాలి లేకపోతే జీపీడీపీ ప్లాన్ ముందుకు కొనసాగదు. ఒకవేళ సంబంధిత శాఖ నిధులు ఏమీ లేకపోతే సున్నాగా నమోదు చేయవచ్చు. కానీ సాధారణ నిధులలో నిధులు వేసి దానికి సంబంధించిన పనులు చూపించి బడ్జెట్ కేటాయింపు చేయవలెను.
III.మిగిలిన పద్ధతిలో ఎటువంటి మార్పు లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులలో మొత్తం TIED నిధుల నుండి 50 శాతం నీటి సరఫరాకు మరియు 50 శాతం పారిశుద్ధ్యనికి సంబంధించిన పనులు గుర్తించి నమోదు చేసి డబ్బులు కేటాయించాలి.
2023-24 సంవత్సరం కి సంబంధించి GPDP ని E-Gramswaraj వెబ్ పోర్టల్ లో నమోదు చేయడానికి ముందు సిద్దం చేసుకోవలసినవి ఏమిటి?
1. E-Gramswaraj వెబ్ పోర్టల్ లో మీ పంచాయతీకి కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు అనగా TIED మరియు UNTIED GRANTS ను ఒక కాగితం మీద రాసుకుని పైన తెలిపిన విధంగా వాటి నియమనిబంధనలు మేరకు మరియు మీరు గ్రామ సభలో ఏవైతే తీర్మానం చేసుకున్నారో ఆ పనులను రాసుకొని నిధులను కేటాయించి సిద్దం చేసుకోండి.
Note:- మీరు 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించాలి అనుకున్న ఎడల ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ నందు నమోదు చేసి , ఆ పనులను కూడా వేరేగా రాసుకొని సిద్దంగా ఉండాలి.
2. మీరు ఏ THEME అయితే ఎంపిక చేసుకున్నారో ఆ THEME లో వున్న ACTIVITIES (E-GRAMSWARAJ వెబ్ పోర్టల్ లో ఉంటాయి) లో సగం కంటే ఎక్కువ పనులు రాసుకొని మొత్తం UNTIED నిధులలో సగం లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు వాటికి కేటాయించి సిద్దంగా ఉండండి.
3. VIBRANT గ్రామ సభ లో మీకు అవసరమైన THEME ని ఎంపిక చేసుకోండి.ఒకవేళ THEME ని మార్చాలి అనుకుంటే ఎలా మార్చలో తెలుసుకొనుటకు దిగువ లింక్ పై క్లిక్ చెయ్యండి.
https://www.telugupublic.com/2023/04/ChangethemesinVibrantgramsabha.html
You Might Like This :
మీరు మీ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నారా?చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, లేకపోతే రాబోవు కాలంలో ఆధార్ కి సంబంధించిన అన్ని సేవలు నిలుపుదల చేసే ప్రమాదం ఉంది. : Click Here
Sankshema Calendar 2023-24 | ఏ నెలలో ఏ పథకాలు అమలు అవుతాయి తెలుసుకోండి. : Click Here
How to change pre-selected themes in vibrant Gram Sabha? : Click Here
ఒక గ్రామపంచాయతీ సంకల్పం రెండు తీమ్స్ సెలెక్ట్ చేసుకుంది.. అపుడు untide నిధులు రెండింటికి కలిపి 50% కేటాయించాలా లేదా ఒక్కోథీమ్ కి 50% నిధులు కేటాయించాలా
ReplyDelete