ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తారో ముందుగానే చెప్పి ఆ నెలలో ఆ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే 2023- 24 సంవత్సరానికి ఏ ఏ నెలలో ఏ ఏ కార్యక్రమం అమలు చేస్తారో తెలియజేసే సంక్షేమ క్యాలెండర్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల విడుదల చేశారు.ఇప్పుడు ఆ సంక్షేమ క్యాలెండర్ పూర్తిస్థాయిలో ఏ పథకము ఏ నెలలో అమలు చేస్తారు, ఆ పథకం యొక్క నియమ నిబంధనలు ఏమిటి , మొదలగునవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.
![]() |
Sankshema Calendar 2023-24 |
ముందుగా ఈ సంవత్సర మొత్తం అమలు చేయు చున్న పథకాలకు సంబంధించి ఏ ఒక్క పథకమైన అర్హత సాధించాలన్న దిగువ తెలిపిన నియమాలు కచ్చితంగా ఉండాలి.
1. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలకు 10,000 పట్టణ ప్రాంతాలు అయితే నెలకు 12,000 రూపాయల లోపు ఉండాలి.2. కుటుంబ సభ్యులలో ఎవరు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో గాని ,ప్రభుత్వ సంస్థల్లో గాని ప్రభుత్వ ఉద్యోగిగా లేదా పెన్షనర్ గా ఉండకూడదు.
3. కుటుంబం మొత్తం కలిసి మూడు ఎకరాలకు మించి మాగాని భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. అయితే మెట్ట మరియు మాగాని రెండు కలిపి పది ఎకరాలు లోపు ఉండవచ్చు.
4.కుటుంబంలో ఎవరికి నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. అయితే టాక్సీలు , ట్రాక్టర్లు , ఆటోలకు దీని నుండి మినహాయింపు ఉంది.
5. నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. (గత 12 నెలల సగటు)
6. కుటుంబంలో ఎవరు ఆదాయ పన్ను చెల్లింపుధారు కాకూడదు.
7. కుటుంబంలో ఎవరికీ మున్సిపల్ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండరాదు.
2023-2024 సంక్షేమ క్యాలెండర్
● 25 మార్చి నుంచి ఏప్రిల్ 5 - వరకు వైయస్సార్ ఆసరా
వైయస్సార్ ఆసరా:-
వైయస్సార్ ఆసరా అనగా 11-04-2019 నాటికి స్వయం సహాయక సంఘాలలో(డ్వాక్రా) సభ్యత్వం ఉన్న మహిళలకు ఆ సంఘం తరఫున బ్యాంకులో ఎంత రుణమైతే ఆ తేదీ నాటికి వుందో ఆ మొత్తం రుణాన్ని 2021-22 వ సంవత్సరం నుంచి 4 విడతలగా స్వయం సహాయక సంఘాల సభ్యులైనటువంటి మహిళల ఖాతాలకు నేరుగా జమ చేయడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల వివరాలు మీ గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంటాయి లేనియెడల గ్రామాలలో వున్న CF లు లేదా CC లను సంప్రదించవలెను.● ఏప్రిల్- జగనన్న వసతి దీవెన, ఈ బీసీ నేస్తం
జగనన్న వసతి దీవెన:-
జగనన్న విద్యా దీవెన అనగా ఇంటర్మీడియట్ తరువాత అనగా ఐటిఐ, ఏదైనా డిగ్రీ లేదా అంతకుమించి కోర్సులను హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ఆహారము మరియు వసతి కొరకు ప్రతి సంవత్సరం ఇచ్చే డబ్బులను జగనన్న వసతి దీవెన అంటారు. ఈ పథకం అర్హత పొందాలంటే ప్రతి విద్యార్థి తప్పకుండా 75% హాజరు ఉండాలి. అదేవిధంగా కరస్పాండెన్స్ విద్యా విధానంలో చదువుకుంటున్న విద్యార్థులు, దూర విద్యా విధానంలో చదువుకుంటున్న విద్యార్థులు, మేనేజ్మెంట్ కోట కింద చదువుకుంటున్న విద్యార్థులు,NRI కోట కింద చదువుకుంటున్న విద్యార్థులు అనర్హులు.ఈ బీసీ నేస్తం :-
45 నుండి 60 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల మహిళలకు వారి జీవన ప్రమాణాల మెరుగుపరుచుట కొరకు ప్రతి సంవత్సరం 15000 చొప్పున మూడు సంవత్సరాలు 45 వేల రూపాయలు ఇచ్చే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించిందే ఈ బిసి నేస్తం. వైయస్సార్ చేయూత, కాపు నేస్తం పథకాల లబ్ధిదారులు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఈ పథకానికి అర్హులు కారు.
● మే - వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్సార్ మత్స్యకార భరోసా
వైఎస్ఆర్ రైతు భరోసా:-
వ్యవసాయ భూమి కలిగిన రైతులకు మరియు భూమిలేని ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనార్టీలకు చెందిన కౌలు రైతులకు పంట కాలంలో పెట్టుబడి నిమిత్తం ప్రతి సంవత్సరం మూడు విడతలుగా(మే,అక్టోబర్,జనవరి నెలలలో) మొత్తం 13,500(ఈ మొత్తంలో పీఎం కిసాన్ డబ్బులు 6000 కలిపి ఉంటుంది) రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.జగనన్న విద్యా దీవెన:-
జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఐటిఐ నుండి పిజి వరకు (ఇంటర్మీడియట్ మినహాయించి) చదువుకుంటున్న బీసీ , ఎస్సీ ,ఎస్టీ ,ఈబిసి (కాపులకు మినహా), కాపు, మైనార్టీ, వికలాంగులైన విద్యార్థులలో అర్హులు గల విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ అందించి వారి విద్యను పూర్తి చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు:-
ఈ పథకం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోఅర్హులైన బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహ నిమిత్తం చేసే ఆర్ధిక సహాయం కొరకు ఉద్దేశించినది. వివాహం జరిగిన 30 రోజులలోపు పెళ్లి కుమార్తె ఏ సచివాలయానికి చెంది ఉంటే ఆ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల ముందు వరకు వివాహం చేసుకొని అర్హత గల లబ్ధిదారులందరికీ కూడా ఈ నెలలో వైయస్సార్ కళ్యాణమస్తులబ్దిని వారి ఖాతాలో జమ చేస్తారు.ఈ పథకం కింద ఎవరికి ఎంత ఆర్థిక లబ్ధి వస్తుంది :
1. BC వదువు కు 50000 రూపాయలు వస్తుంది. అదే విధంగా కులాంతర వివాహం చేసుకున్న BC లకు 75000 రూపాయలు అందించనున్నారు.
2. SC మరియు ST వధువుకు Rs.1,00,000 పెళ్లి కానుకగా వస్తుంది. అదేవిధంగా కులాంతర వివాహం చేసుకున్న SC మరియు ST వధువులకు 1,20,000 రూపాయలు ఇస్తారు.
3. విభిన్న ప్రతిభావంతులు (Disabled persons)అయిన వారికి Rs.1,00,000 పెళ్లి కానుకగా అందించనున్నారు.అదేవిధంగా కులాంతర వివాహం చేసుకున్న వారికి Rs.1,50,000 రూపాయలు ఇస్తారు.
4. భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు (వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ ఉండాలి) చెందిన వధువుకు 40 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు.
5. మైనార్టీలకు Rs.1,00,000 ఆర్థిక సహాయం అందిస్తారు.
వైయస్సార్ మత్స్యకార భరోసా:-
మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో లేదా సముద్రంలో వేట నిషేధ కాలంలో అనగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు(మొత్తం 61 రోజులు)(రెండు కాలాలు కలిపి) ఆ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆదాయ వనరులు ఉండవు కాబట్టి ఆ కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం అర్హత గల ప్రతి కుటుంబానికి Rs.10000 అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వానికి చెందిన ఇతర పథకాలు ఉదాహరణకు వైఎస్ఆర్ చేయూత, చేదోడు, వాహన మిత్ర ,కాపు నేస్తం ,రైతు భరోసా మొదలగునివి ఏవైనా పొంది ఉన్న ఎడల ఈ పథకానికి అర్హులు కాదు.● జూన్ - జగనన్న విద్య కానుక, జగనన్న అమ్మఒడి, వైయస్సార్ లా నేస్తం
జగనన్న విద్య కానుక:- స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు వారి యొక్క యూనిఫార్మ్స్, పుస్తకాలు మొదలగునవి కొనుగోలు భారం లేకుండా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరుతో ఒక్కొక్క విద్యార్థికి మూడు జాతుల యూనిఫార్మ్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఒక జత బూట్లు, రెండు చేతుల సాక్షులు, స్కూల్ బ్యాగ్, బెల్టు తోపాటు డిక్షనరీ కలిపి కిట్ రూపంలో ఇచ్చే పథకమే జగనన్న విద్యా కానుక.
జగనన్న అమ్మఒడి:-
ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న దారిద్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చదువు భారంగా మారకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు(కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది) ప్రతి సంవత్సరం ఆ విద్యార్థి తల్లుల ఖాతాలకు లేదా వారి సంరక్షకుల ఖాతాలో 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
వైయస్సార్ లా నేస్తం:-
వైయస్సార్ లా నేస్తం పథకం ద్వారా లా చదువుకొని జూనియర్ లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారి జీవనోపాధి మెరుగు కొరకు ప్రతి నెల 5000 రూపాయలు ఇస్తారు.
● జూలై - జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న తోడు, వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ నేతన్న నేస్తం, వైయస్సార్ కళ్యాణమస్తు
జగనన్న విదేశీ విద్యా దీవెన :-
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో భాగంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ , బీసీ, ఈ బీసీ, కాపు మరియు మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా విదేశాలలో పేరుపొందిన యూనివర్సిటీలలో సీట్లు సంపాదించి చదువుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వారికి పూర్తిస్థాయి ట్యూషన్ ఫీజు ప్రభుత్వమే భరిస్తూ వారి విద్యను పూర్తి చేసే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే జగనన్న విదేశీ విద్య దేవన.జగనన్న తోడు:-
ఈ పథకంలో భాగంగా వీధి వ్యాపారులు, తోపుడు బండ్లు పై వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపార అభివృద్ధి నిమిత్తం ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఎటువంటి వడ్డీ లేకుండా ఇచ్చి , లబ్దిదారులు తిరిగి నెలవారి చెల్లింపులు రూపంలో చెల్లించే పథకమే జగనన్న తోడు.వైయస్సార్ సున్నా వడ్డీ:-
ఈ పథకం ద్వారా స్వయం శక్తి మహిళా సంఘాలు అనగా డ్వాక్రా సంఘాలకు ఎటువంటి వడ్డీ లేకుండా వారి జీవనోపాధి మెరుగుపరచుకోవడం కొరకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.వైయస్సార్ నేతన్న నేస్తం:-
సొంత మగ్గాలు కలిగిన నేతన్నలకు ఆ మగ్గాలను ఆధునికరించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచుట నిమిత్తం అర్హత కలిగిన నేతన్నలకు సంవత్సరానికి 24 వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేసే పథకమే వైయస్సార్ నేతన్న నేస్తం. ఒక కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నప్పటికీ ఒకే ఒక్కరికి అర్హత ఉంటుంది.
వైయస్సార్ కళ్యాణమస్తు:-
● ఆగస్టు - వైయస్సార్ వాహన మిత్ర, వైయస్సార్ కాపు నేస్తం
వైయస్సార్ వాహన మిత్ర:-
సొంత వాహనం అనగా ఆటో, టాక్సీ లేదా మాక్సి కలిగిన డ్రైవర్లకు వారి వాహనం వార్షిక నిర్వహణకు లేదా వాహన ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ లు రెన్యువల్ చేసుకొనుటకు సహాయ పడుట నిమిత్తం ప్రతి సంవత్సరం వారి ఖాతాలో నేరుగా పదివేల రూపాయలు జమ చేసే పథకమే వైయస్సార్ వాహన మిత్ర.
వైయస్సార్ కాపు నేస్తం:-
45 నుండి 60 సంవత్సరాలు కలిగిన కాపు , బలిజ, తెలగ , ఒంటరి కులాలకు చెందిన మహిళలకు వారి జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచుకోవటానికి,జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి లేదా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి నిమిత్తం సంవత్సరానికి 15000 చొప్పున మొత్తం ఐదు సంవత్సరాలకు 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే వైయస్సార్ కాపు నేస్తం.
● సెప్టెంబర్ -వైఎస్ఆర్ చేయూత
వైఎస్ఆర్ చేయూత:-
45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు మధ్య గల బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మరియు మైనార్టీలకు చెందిన మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడం కోసం లేదా వారి జీవనోపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 18,750 చొప్పున వరుసగా నాలుగు సంవత్సరాలు మొత్తం 75 వేల రూపాయలు నేరుగా వాటి ఖాతా లో జమ చేసే అతిపెద్ద పథకము వైఎస్ఆర్ చేయూత.● అక్టోబర్ - వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన :
ఈ నెలలో మరొక విడత వైయస్సార్ రైతు భరోసా మరియు జగనన్న వసతి దీవెన ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాల గురించి పైన వివరించడం జరిగింది.
● నవంబర్ -వైయస్సార్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన
ఈ నెలలో మరో విడత మహిళా సంఘాలకు వైయస్సార్ సున్నా వడ్డీ నిధులు విడుదల చేస్తారు.
గత మూడు నెలల నుండి ఇప్పటివరకు జరిగిన వివాహాలలో అర్హత కలిగి దరఖాస్తు చేసుకున్న వారికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు నిధులను నేరుగా వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది.
మరో విడత విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేస్తారు.
● డిసెంబర్ - జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న చేదోడు
జగనన్న విదేశీ విద్యా దీవెన:-
మరో విడత జగనన్న విదేశీ విద్యార్థి వన నిధులు విడుదల చేస్తారు.
జగనన్న చేదోడు:-
షాపులు నిర్వహిస్తున్న టైలర్లు రజకలు, నాయి బ్రాహ్మణులులలో అర్హత కలిగిన వారు వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడానికి మరియు వృత్తి పరికరాలు కొనుగోలు చేయుట నిమిత్తం సంవత్సరానికి 10,000 చొప్పున వరుసగా ఐదు సంవత్సరాలు 50,000 రూపాయలు వారి ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది.
● జనవరి /24 - వైఎస్ఆర్ ఆసరా, వైయస్సార్ లా నేస్తం, పెన్షన్ల పెంపు
వైయస్సార్ ఆసరా మరియు వైయస్సార్ లా నేస్తం మరో విడత నిధులను విడుదల చేస్తారు.
పెన్షన్ల పెంపు:- ప్రస్తుతం ఉన్న 2750 పెన్షన్ను ఈ నెల నుండి 3000 కు పెంచుతూ పంపిణీ చేస్తారు.
● ఫిబ్రవరి /24 -జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు,ebc నేస్తం
జగనన్న విద్యా దీవెన, వైయస్సార్ కళ్యాణమస్తు(గత మూడు నెలల నుండి జరిగిన వివాహాలలో అర్హత కలిగి దరఖాస్తు చేసుకున్న వారికి నిధులను విడుదల చేస్తారు), ఈ బీసీ నేస్తం మరొక విడత నిధులు ఈ నెలలో విడుదల చేస్తారు.● మార్చి /24 - జగనన్న వసతి దీవెన
జగనన్న వసతి దీవన మరొక విడత నిధులు ఈ నెలలో విడుదల చేస్తారు.
ఇంకెందుకు ఆలస్యం పైన తెలిపిన సంక్షేమ క్యాలెండర్ లో మీరు ఏ పథకానికి అర్హులో తెలుసుకొని దానికి సంబంధించిన పత్రాలు తో సిద్ధంగా ఉంచుకోండి. పైన తెలిపిన సమాచారం విషయ పరిజ్ఞానానికి మాత్రమే అందించడం జరిగింది. పూర్తి వివరాలకు మీరు దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సంప్రదించండి.
Also Read This:
- జనన మరియు మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం ఎలా ?
- Aadhar Document Update | ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నారా? చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.
- మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి? ఎవరు అర్హులు? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి?
Very good
ReplyDeleteThanku Sir For Being a Part of Telugu Public...If You Like Our Website please Share it
DeleteThanku Sir For Being a Part of Telugu Public...If You Like Our Website please Share it
ReplyDelete