మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి?
ఎవరైనా పిల్లలు 0 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని ఎడల అటువంటి వారికి సంరక్షణ అవసరమై లేదా అటువంటి పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య మరియు అభివృద్ధి అవసరాలు తీర్చడానికి కొంత సహాయం అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయినటువంటి మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. ఇది కొన్ని షరతులతో కూడుకొని ఉంటుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఈ పథకము కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.ఒక కుటుంబం లో ఇద్దరు పిల్లల వరకు ధరకాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
1. తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
2. పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
3. తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
4. బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
5. కోవిడ్ 19 అనగా కరోనా వలన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే పీఎంకేర్స్ పథకం కింద నమోదు అయిన అటువంటి పిల్లలు.
Application Form Download: Click Here
ఈ పథకానికి కావలసిన ఆర్థిక ప్రమాణాలు.
1. ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.72,000 కి మించి ఉండరాదు.
2. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం రూ.96,000 నుంచి ఉండరాదు.
మిషన్ వాత్సల్యకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు జత చేయవలసిన పత్రాలు వివరాలు:-
1. బాలుడి లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం
2. బాలుడి లేదా బాలిక ఆధార్ కార్డు
3. తల్లి ఆధార్ కార్డు
4. తండ్రి ఆధార్ కార్డు
5. తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రము, మరణ కారణము
6. గార్డియన్ ఆధార్ కార్డు
7. రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డు
8. కుల ధ్రువీకరణ పత్రము
9. బాలుడి లేదా బాలిక పాస్ ఫోటో
10. స్టడీ సర్టిఫికేట్
11. ఆదాయ ధ్రువీకరణ పత్రము
12. బాలుడి లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ ఎకౌంటు లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్.
పైన తెలిపిన పత్రాలతో పాటు దరఖాస్తును మీకు సంబంధించిన సి.డి.పి.ఓ కార్యాలయానికి గడువు లోపల అందించగలరు.
Application Form Download: Click Here
ఎంపిక పద్ధతి:- గడువులోగా సి.డి.పి.ఓ కార్యాలయానికి అందిన దరఖాస్తులు అన్నింటిని మండల స్థాయిలో స్క్రూట్ ని కమిటీ వారు నిశితంగా పరిశీలిస్తారు వాటిలో అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తారు అక్కడ నుండి సభ్యుల సంతకాలతో కూడిన దరఖాస్తులు అన్నింటిని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారి వారి కార్యాలయానికి పంపిస్తారు.అక్కడ నుండి జిల్లా కలెక్టర్ గారి ఆమోదానికి పంపిస్తారు.
గమనించవలసిన ముఖ్యమైన విషయాలు:-
1. ఈ పథకానికి అర్హులైన పిల్లలు భవిష్యత్తులో ఏదైనా హాస్టల్స్ లో జాయిన్ అయితే అక్కడ నుంచి పథకం నిలుపుదల చేస్తారు.
2. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు హాజరు వరుస 30 రోజులకు పైబడి సక్రమంగా లేనియెడల ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తారు. అయితే ప్రత్యేక అవసరాలు గలిగిన బాల బాలికలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
3. ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.
4. తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.
5. పిల్లల స్టడీ certificate ఈ సంవత్సరం అనగా 2022-2023 మాత్రమే సమర్పించండి.
దరఖాస్తు నింపే తప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:-
1. మొదటి నాలుగు కాలంలలో చిరునామా నింపవలెను.
2. తదుపరి పిల్లల వివరాలు నింపేటప్పుడు పిల్లల పేర్లు విడివిడి అక్షరాలలో క్యాపిటల్ లెటర్స్ లో రాయండి.
3. తండ్రి మరణించిన లేక బతికున్న సరే తండ్రి పేరు ఖచ్చితంగా రాయవలెను.
4. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయేటప్పుడు గార్డియన్ పేరు వద్ద గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారి పేరు మరియు వారి ఆధార్ నెంబరు రాయాలి.
5. పిల్లల జనన ధ్రువీకరణ పత్రానికి సంబంధించి గ్రామపంచాయతీ కార్యాలయము లేదా మున్సిపల్ కార్యాలయం నుండి పొందినది లేదా స్కూలు నుండి పొందిన సర్టిఫికెట్స్ ను సమర్పించవచ్చు.
6. పిల్లల బ్యాంకు వివరాలు ఏదైనా నేషనల్ బ్యాంక్ నుండి తీసుకుంటే మంచిది.
మరిన్ని పూర్తి వివరాలకు అంగన్వాడీ కార్యకర్తలు లేదా సచివాలయం లో మహిళ పోలీసు వారిని సంప్రదించండి.
ఈ పథకానికి సంబంధించిన ప్రశ్నలు మరియు జవాబులు.:
Q1.ఈ పథకానికి చివరి తేదీ ఎప్పుడు?
-April 15th
Q2.ఈ పథకానికి అర్హులైన పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం ఎంత ఉండాలి?
-రూ.72,000 కి మించి ఉండరాదు.
Q3.పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంస్థ ఆదాయం ఎంత ఉండాలి?
-రూ.96,000 నుంచి ఉండరాదు.
Q4.ఈ పథకం ద్వారా పిల్లలు ఎంత లబ్ధి పొందుతారు?
- ఈ స్పాన్సర్షిప్ ద్వారా పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించడం జరుగుతుంది.
Q5.ఈ పథకానికి ఎవరు అర్హులు?
1. తండ్రి మరణించిన అనగా తల్లి వితంతువుగా ఉన్న లేదా విడాకులు తీసుకున్న (కోర్టు నుండి పొందిన ఆదేశాలు ఉండాలి లేదా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకున్న ఒప్పంద పత్రం తో ధరకాస్తు చెయ్యొచ్చు కానీ కమిటీ నిర్ణయమే ఫైనల్ ) లేదా కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
2. పిల్లలకు తల్లి మరియు తండ్రి ఇద్దరు మరణించి అనాధలుగా ఉండి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు.
3. తల్లిదండ్రులు ప్రాణాపాయ లేదా ప్రాణాంతక వ్యాధికి గురైన వారు
4. బాల కార్మికులుగా గుర్తించబడిన పిల్లలు, కుటుంబంతో లేని పిల్లలు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలు, బాల యాచకులు, ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి గురైన పిల్లలు, వీధులలో నివసిస్తున్నటువంటి పిల్లలు, దోపిడీకి గురైన పిల్లలు (JJ Act,2015 ప్రకారం).
Q6.ఈ పథకాన్ని స్పాన్సర్స్ షిప్ కమిటీ వాళ్ళు జీవితాంతం ఇస్తారా?
-ఈ స్పాన్సర్షిప్ కమిటీ వారు ప్రతి సంవత్సరము ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్షిప్ ను నిలిపివేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.
Q7.తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం వస్తుందా?
-తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పిన తల్లి వున్నట్టు కాబట్టి.
Q8.ఈ పథకం కు ఎంపికైన వారు ప్రతి రోజు బడికి వెళ్ళకపోతే ఏమవుతుంది?
- పాఠశాలకు వెళ్లే విద్యార్థులు హాజరు వరుస 30 రోజులకు పైబడి సక్రమంగా లేనియెడల ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తారు. అయితే ప్రత్యేక అవసరాలు గలిగిన బాల బాలికలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
మరిన్ని ప్రభుత్వ పథకాలు :
- ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన
- అటల్ పెన్షన్ యోజన
- ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
- ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
- స్వామిత్వ యోజన
- కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్
- ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన
- రాష్ట్రీయ ఉచ్చతర్ షిక్......Etc
వైఎస్సార్ కళ్యాణమస్తు/ వైఎస్సార్ షాదీ తోఫా పథకం పొందడం ఎలా? : Click Here
జనన మరియు మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం ఎలా ? : Click Here