వైఎస్సార్ కళ్యాణమస్తు/ వైఎస్సార్ షాదీ తోఫా పథకం పొందడం ఎలా?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, నవరత్నాలు పేరుతో మరియు ఇతర పేర్లతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది, అందులో భాగంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో అర్హులైన ఆడపిల్లలకు జరిగే వివాహ ఖర్చులు నిమిత్తం ఆర్థిక సహాయం చేయడానికి 2022 అక్టోబర్ 1 నుండి అమలు చేస్తున్న పథకమే వైయస్సార్ కళ్యాణమస్తు/వైయస్సార్ సాదితోప. అసలు ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి , ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఏమిటి ఉండాలి, మొదలగు అంశాలన్నీ ఇప్పుడు చూద్దాం.
ఈ పథకం ఎవరికి ఉద్దేశించినది?
ఈ పథకం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోఅర్హులైన బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహ నిమిత్తం చేసే ఆర్ధిక సహాయం కొరకు ఉద్దేశించినది.
ఈ పథకం అర్హతలు ఏమిటి?
1. వైయస్సార్ కళ్యాణమస్తు పథకం అక్టోబర్ 1 2022 తరువాత జరిగిన వివాహాలకు మాత్రమే వర్తిస్తుంది.
2. వైయస్సార్ కళ్యాణమస్తు పథకానికి పెళ్లి కుమార్తె బీసీ, ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి,లేదా భవన నిర్మాణ కార్మికుల కుటుంబంలో జన్మించి ఉండాలి.
3. పెళ్లి కుమార్తె వయస్సు 18 సంవత్సరాలు మరియు పెళ్లి కుమారుడు వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
4. పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె కచ్చితంగా పదవ తరగతి పాసై ఉండాలి.
5. పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలకు 10,000 పట్టణ ప్రాంతాలు అయితే నెలకు 12,000 రూపాయల లోపు ఉండాలి.
6. ఇరువురి కుటుంబ సభ్యులలో ఎవరు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో గాని ,ప్రభుత్వ సంస్థల్లో గాని ప్రభుత్వ ఉద్యోగిగా లేదా పెన్షనర్ గా ఉండకూడదు అయితే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు దీని నుండి మినహాయింపు ఉంది.
7. మూడు ఎకరాలకు మించి మాగాని భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. అయితే మెట్ట మరియు మాగాని రెండు కలిపి పది ఎకరాలు లోపు ఉండవచ్చు.
8. కుటుంబంలో ఎవరికి నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. అయితే టాక్సీలు , ట్రాక్టర్లు , ఆటోలకు దీని నుండి మినహాయింపు ఉంది.
9. నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. (గత 12 నెలల సగటు)
10. కుటుంబంలో ఎవరు ఆదాయ పన్ను చెల్లింపుధారు కాకూడదు.
11. కుటుంబంలో ఎవరికీ మున్సిపల్ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండరాదు.
Note:- మొదటిసారి వివాహం జరిగి భర్త చనిపోయిన వితంతువులు మరల వివాహము చేసుకోవాలి అనుకున్న ఎడల వారు కూడా ఈ పథకానికి అర్హులు.
ఈ పథకం కింద ఎవరికి ఎంత ఆర్థిక లబ్ధి వస్తుంది?
1. బీసీ వదువు కు 50 వేల రూపాయలు వస్తుంది. అదే విధంగా కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు 75 వేల రూపాయలు అందించనున్నారు.
2. ఎస్సీ మరియు ఎస్టీ వధువుకు Rs.1,00,000 పెళ్లి కానుకగా ఇవ్వనున్నారు. అదేవిధంగా కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ మరియు ఎస్టీ వధువులకు 1,20,000 రూపాయలు ఇస్తారు.
3. విభిన్న ప్రతిభావంతులు (Disabled persons)అయిన వారికి Rs.1,00,000 పెళ్లి కానుకగా అందించనున్నారు.అదేవిధంగా కులాంతర వివాహం చేసుకున్న వారికి Rs.1,50,000 రూపాయలు ఇస్తారు.
4. భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు (వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్ ఉండాలి) చెందిన వధువుకు 40 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు.
5. మైనార్టీలకు Rs.1,00,000 ఆర్థిక సహాయం అందిస్తారు.
కులాంతర వివాహం అనగా ఏమిటి?
కులాంతర వివాహం అనగా బీసీ , ఎస్సీ , ఎస్టీ, లకు చెందిన వధువు వేరే కులాలకు చెందిన వరుడు ను వివాహం చేసుకున్నచో దానిని కులాంతర వివాహం అంటారు.
వివాహం జరిగిన ఎన్ని రోజులలోపు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి?
వైయస్సార్ కళ్యాణమస్తు లేదా సాదితోప పథకానికి సంబంధించిన లబ్ధి పొందుటకు వివాహము జరిగిన 30 రోజులలోపు వదువు కు సంబంధిత గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వివాహము వరుడు ఇంట్లో జరిగితే వివాహ నమోదు వరుడుకు సంబంధించిన గ్రామ సచివాలయంలో నమోదు చేసి ఆ ధ్రువీకరణ పత్రం తీసుకొని వధువు గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
వైయస్సార్ కళ్యాణమస్తు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు :
1. పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె యొక్క వయసు ధ్రువీకరణ పత్రాలు.
2. వివాహ నమోదు పత్రము (మ్యారేజ్ సర్టిఫికెట్)
3. వరుడు మరియు వధువు యొక్క విద్యార్హతలు అనగా పదవ తరగతి పాస్ అయిన ధృవీకరణ పత్రము.
4. ఇరువురి కుటుంబాల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
5. ఇరువురి కుటుంబాల కుల ధ్రువీకరణ పత్రాలు.
6. వివాహ సమయంలో తీసిన ఫొటోస్ మరియు వెడ్డింగ్ కార్డ్
7. ఒకవేళ వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్
8. ఒకవేళ వదువు వితంతు అయితే ముందు భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం మరియు వితంతు పెన్షన్ certificate, ఒకవేళ ఇవేమీ లేకపోతే affidavit ఉండాలి.
9. ఒకవేళ భవన నిర్మాణ కుటుంబ సభ్యులు అయితే AP buildings and other construction workers welfare board నుండి membership certificate ఉండాలి.
దరఖాస్తు చేయు విధానం
YSR Kalyanamasthu Application Pdf :- Pdf_Download
1. పైన తెలిపిన విధంగా అన్ని అర్హతలు ఉన్న ఎడల అన్ని వివరాలు తీసుకొని మీ సచివాలయం నకు వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ వారికి సమర్పించినచో వారు NAVASAKAM MANAGEMENT PORTAL లో దరఖాస్తులు చేస్తారు.
2. డిజిటల్ అసిస్టెంట్ దరఖాస్తు చేసిన వెంటనే ఆ ధరకాస్తు ఫీల్డ్ వెరిఫికేషన్ నిమిత్తం వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్ లోకి వెళుతుంది. అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ గారు పెళ్లి కుమార్తె మరియు పెళ్లి కుమారుడి యొక్క E -KYC తీసుకుంటారు. మరియు సంబంధిత డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి అక్కడనుండి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి లాగిన్ లోకి పంపిస్తారు.
3. MPDO గారు లాగిన్ లోకి వచ్చిన దరఖాస్తును పరిశీలించి అన్ని అర్హతలు ఉన్న యెడల PD-DRDA
కు పంపిస్తారు.
4.PD-DRDA గారు తనకు వచ్చిన దరఖాస్తును పరిశీలించి అక్కడనుండి SIX STEP VALIDATION కు పంపిస్తారు.
5. తరువాత గ్రామ సచివాలయంలో సోషల్ ఆడిట్ నిమిత్తం ప్రచురించడం జరుగుతుంది.
6. అక్కడనుండి అర్హత గల దరఖాస్తులు గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆమోదం కొరకు వెళ్తాయి.
7. జిల్లా కలెక్టర్ వారు ఆమోదించిన తర్వాత రాష్ట్ర వెల్ఫేర్ కార్పొరేషన్ కు వెళ్తాయి.
8. వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి నేరుగా లబ్ధిదారుని ఖాతాలో డబ్బులు నేరుగా పడతాయి.
పైన వివరించిన పథకం కు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి వివరాలు కొరకు మీకు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి సంప్రదించగలరు.
Flow Chart :
keep doing more
ReplyDeleteThank you for response
DeleteThanku Sir For Being a Part of Telugu Public...If You Like Our Website please Share it
ReplyDelete