యూట్యూబ్‌లో టైమ్ వృథా అవుతుందా? అయితే ఈ ఆర్టికల్ మీకోసం
మనలో చాలా మంది యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఒక వీడియో చూడాలని అనుకుంటాం, కానీ చివరికి సంబంధం లేని అనవసరమైన వీడియోలు మరియు Shorts చూస్తూ గంటలు గడిపేస్తాం. ఫలితంగా మన సమయం వృథా అవుతుంది, మన ప్లాన్ చేసిన వీడియో మాత్రం మిగిలిపోతుంది.
కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!
ఈ ఆర్టికల్ చదివిన తర్వాత, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారీ మీరు అనుకున్న వీడియోనే చూడగలుగుతారు అదీ పూర్తిగా డిస్ట్రాక్షన్‌లేకుండా! 🎯
అలా చేయాలంటే, కింది సింపుల్ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి👇
Step 1: ముందుగా కింద ఇచ్చిన ఇమేజ్ లో చూపిస్తున్నట్టుగా మీ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి.
Step 2: Step 1లో చెప్పిన స్క్రీన్ ఓపెన్ అయ్యాక అక్కడ ఉన్న 'History' పక్కన ఉన్న ' View all ' పైన క్లిక్ చేయండి.
Step 3: 'View all' మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చిన స్క్రీన్ లో పైన ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి,క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఆప్షన్స్ లో 'Clear all Watch History' పై క్లిక్ చేయండి .
Step 4: 3 డాట్స్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు క్రింద Image లొ చూపించినట్టుగా pop-up వస్తుంది ఆ pop-up లో 'Clear Watch History' పై క్లిక్ చేసి మీ హిస్టరీని క్లియర్ చేసుకోండి.
Step 5: హిస్టరీ క్లియర్ చేసుకున్న తర్వాత Step 3 లొ చెప్పిన ఆ 3 డాట్స్ పై మళ్లీ క్లిక్ చేయండి, చేసిన తర్వాత వచ్చిన ఆప్షన్స్ లో అక్కడ ఉన్న 'Pause Watch History' పై క్లిక్ చేయండి.
Step 6: 'Pause Watch History ' పై క్లిక్ చేసిన తర్వాత మీకు క్రింద చూపించిన Image లో ఉన్నట్టుగా ఒక Pop-up వస్తుంది , ఆ pop-up లో ఉన్న 'Pause' పై క్లిక్ చేయండి.
ఇప్పటి వరకు మీరు చేసిన సెట్టింగ్స్ పూర్తి అయ్యాక, ఇప్పుడు ఒక చిన్న స్టెప్ మాత్రమే మిగిలుంది 👇
- ముందుగా YouTube యాప్‌ను క్లోజ్ చేయండి.
- తర్వాత Recent Apps లిస్టులోనుంచి కూడా యూట్యూబ్‌ను పూర్తిగా తీసేయండి.
ఇప్పుడు మళ్లీ యూట్యూబ్‌ను ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీరు స్క్రీన్‌పై కింద చూపిన ఇమేజ్‌లాగే ఒక క్లీన్ ఇంటర్‌ఫేస్‌ను చూడగలుగుతారు.
ఇక్కడ మీకు ఎటువంటి అనవసరమైన వీడియో ఫీడ్ కనిపించదు 🙅♂️
అదే కాకుండా, Shorts Feed కూడా పూర్తిగా కనిపించదు! 🎉
ఇప్పటి నుంచి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారీ, మీరు చూడాలనుకున్న వీడియోనే — నేరుగా సెర్చ్ బార్‌లో టైప్ చేసి చూసుకోవచ్చు 🔍
ఇలా చేస్తే మీ సమయం ఆదా అవుతుంది ⏰
మరియు యూట్యూబ్ అనుభవం మరింత ఫోకస్‌డ్ & ప్రొడక్టివ్‌గా మారుతుంది 💡
Thanks
ReplyDelete