ఆంధ్రప్రదేశ్ కుల గణన సర్వే 2023
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023లో నిర్వహించాలని నిర్ణయించిన కుల గణన సర్వే 19-01-2024నుండి ప్రారంభించబడుతుంది.
సర్వే విధానం :
సర్వే పూర్తిగా GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో జరుగుతుంది. వాలంటీర్ వారి లాగిన్ లో మాత్రమే సర్వే అనేది జరుగుతుంది. సిటిజెన్, సచివాలయ ఉద్యోగి, వాలంటీర్ల eKYC అయితేనే సర్వే అవుతుంది.
ప్రశ్నలు
సర్వేలో అడిగే ప్రశ్నలు రెండు విభాగాలుగా ఉంటాయి.
Section - 1
- ప్రస్తుత జీవనస్థితి (సర్వేకి అందుబాటులో ఉన్నారు / మరణించి ఉన్నారు)
కుటుంబ ప్రాథమిక వివరాలు
- జిల్లా పేరు
- మండలం / మున్సిపాలిటీ / మున్సిపల్ కార్పొరేషన్ పేరు
- పంచాయితీ
- వార్డు నెంబరు
- హౌస్ నెంబరు
హౌస్ ఓల్డ్ వివరాలు
- కుటుంబ పెద్ద పేరు
- కుటుంబ పెద్ద ఆధారు నెంబర్
- కుటుంబ పెద్దతో కలిపి ఇంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య
- కుటుంబ సభ్యుల పేర్లు
- కుటుంబ సభ్యులకు కుటుంబ పెద్దతో బంధుత్వం
- ప్రస్తుత చిరునామా
- రైస్ కార్డు నెంబరు
- ఇంటి రకము( రేకు ఇల్లు / పూరి గుడిసా / డాబా ఇల్లు /డూప్లెక్స్ హౌస్ /అపార్ట్మెంట్లో ఇల్లు ) మరుగుదొడ్ల సదుపాయం (సొంత మరుగుదొడ్లు / పబ్లిక్ టాయిలెట్ / ఆరుబయట )
- త్రాగునీటి సదుపాయము
- గ్యాస్ సదుపాయము
- పసుసంపద సమాచారము
Section - 2
కుటుంబ సభ్యుల వివరాలు
- కుటుంబ సభ్యుని పేరు
- తండ్రి లేదా భర్త పేరు
- లింగము
- పుట్టిన తేదీ
- వివాహ స్థితి
- కులము
- ఉప కులము
- మతము
- విద్యా అర్హత
- వృత్తి
- పంట భూమి
- నివాస భూమి
కుల గణన సర్వే చేయు విధానం
Step:1
- GSWS Volunteer మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయండి.
- వాలంటీర్ యొక్క CFMS IDని నమోదు చేసి, లాగిన్ అవండి.
- లాగిన్ అయిన తర్వాత, హోం పేజీలో "కుల గణన సర్వే" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Step:2
- మీ క్లస్టర్‌లోని అన్ని కుటుంబాల జాబితా కనిపిస్తుంది.
- మీరు సర్వే చేయాలనుకుంటున్న కుటుంబాన్ని ఎంచుకోండి.
Step:3
తరువాతి పేజీలో ఆ కుటుంబానికి సంబంధించి రెండు Sectionలు చూపిస్తుంది Section-1 మరియు Section-2 .Section-1 లో హౌస్ ఓల్డ్ డీటెయిల్స్ చూపిస్తుంది Section-2 లో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల పేర్లు మనకు చూపిస్తుంది.
ముందుగా Section-1 హౌస్ హోల్డ్ డీటెయిల్స్ పై Pending పై క్లిక్ చేయాలి.
Pendingపై క్లిక్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల జీవన స్థితి? అనేది అడుగుతుంది అందులో రెండు ఆప్షన్లో ఉంటాయి
- సర్వే కి అందుబాటులో ఉన్నారు మరియు
- కుటుంబ సభ్యులు అందరూ మరణించి ఉన్నారు
ని రెండు ఆప్షన్లో చూపిస్తుంది. సర్వేకి అందుబాటులో ఉన్నారు అని సెలెక్ట్ చేస్తే తరువాత ప్రశ్నలు చూపిస్తుంది. అదే కుటుంబ సభ్యులందరూ మరణించి ఉన్నారు అని చూపిస్తే అంతటితో సర్వే ఆ కుటుంబానికి పూర్తి అవుతుంది.
Step 4 :
తరువాతి పేజీలో సర్వేకు సంబంధించిన ప్రశ్నలను చూపిస్తుంది అందులో మొత్తం 14 రకముల ప్రశ్నలు ఉంటాయి.
- జిల్లా,జిల్లా కోడ్,మండలం/ మున్సిపాలిటీ,గ్రామం, పంచాయతీ మరియు పంచాయతీ కోడ్,వార్డు నెంబర్,ఇంటినెంబర్.
- కుటుంబ పెద్ద పేరు,ఆధార్ నెంబర్,
- కుటుంబ సభ్యుల సంఖ్య, Family member పేరు మరియు కుటుంబ పెద్ద తో గల సంబందం, రేషన్ కార్డు నెంబర్.
- కుటుంబం నివాసం ఉంటున్న ఇళ్లు Type( Kutcha house, Building,Duplex, puccaHouse etc.
- ప్రస్తుతం ఉన్న చిరునామా.
- Toilet facilityఉందా లేదా.?
- మంచి నీరు / త్రాగు నీరు సదుపాయం ఉందా? ( Public tap,Borewell, public borewell etc..)
- Live stock ఏమైనా కలిగి ఉన్నారా.? (ఆవులు, గేదెలు, మేకలు,గొర్రెలు etc)
- Gas Connection Type( LPG / Kerosene/Fire wood etc.
'ముఖ్యంగా 7వ ప్రశ్నలో కుటుంబ పెద్దని ఎంచుకోమని చూపిస్తుంది. వారి ఇంట్లో ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారిని ఎంచుకొని తరువాతి సెక్షన్లో మిగిలిన వారు కుటుంబ పెద్దతో ఉన్నటువంటి బంధుత్వాన్ని ఎంచుకోవాలి.
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం కుటుంబ ఐడి సంఖ్య వస్తుంది జిల్లా పేరు కోడు ఆటోమెటిగ్గా వస్తాయి మండల మున్సిపాలిటీ నగరపాలక సంస్థ ఆటోమేటిక్గా వస్తుంది పంచాయతీ కోడు సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది ఊరి పేరును ఎంచుకోవాలి.
Step 5:
సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, కుటుంబం యొక్క eKYC పూర్తి చేయండి.
Biometric, Iris లేదా OTP ద్వారా eKYC పూర్తి చేయండి.తరువాత ఎవరైతే వాలంటీరు సర్వే చేస్తున్నారు వారు కూడా eKYC చేస్తే ఆ ఇంటికి Section - 1 సర్వే పూర్తి అయినట్టు అర్థము .
Step 6:
ఇప్పుడు Section-2 తెరుచుకుంటుంది. ఇందులో హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ద్వారా లభించిన కుటుంబ సభ్యుల పేర్లు మరియు వారి పక్కన "Pending" అని కనిపిస్తుంది. అందుబాటులో ఉన్న సభ్యుల పేరు పక్కన ఉన్న "Pending" ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, "సభ్యుని జీవన స్థితి?" అని అడుగుతుంది.
- "జీవించి ఉన్నారు" అని ఎంచుకుంటే, సభ్యుని జీవన స్థితి "Completed" గా మారుతుంది.
- "మరణించడం జరిగింది" అని ఎంచుకుంటే, సభ్యుని జీవన స్థితి "Completed" గా మారుతుంది.
జీవించి ఉన్న మరియు అందుబాటులో ఉన్న సభ్యుని పేరు పక్కన ఉన్న "Pending" ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, ఆ వ్యక్తికి సంబంధించిన ప్రశ్నలు తెరుచుకుంటాయి. ఈ ప్రశ్నలలో ముఖ్యమైనవి:
- హౌస్ ఓల్డ్ డేటా ప్రకారం ఈ కేవైసీ పూర్తి అయినదా లేదా?
- తండ్రి లేదా భర్త పేరు
- వివాహ స్థితి
- కులం
- మతం
- విద్యా అర్హత
- వృత్తి
- వ్యవసాయ భూమి విస్తీర్ణం
కులం విషయంలో, మీరు సర్వే చేస్తున్న వ్యక్తి గతంలో ఏపీ సేవా క్యాస్ట్ సర్టిఫికెట్ పొంది ఉన్నట్లయితే, అప్పుడు కులం ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. లేకపోతే, మాన్యువల్‌గా కులం మరియు ఉపకులాన్ని ఎంచుకోవాలి. మతాన్ని కూడా అదే విధంగా ఎంచుకోవాలి.
Step 7:
పై ప్రశ్నలకు అన్ని సమాధానాలు ఎంటర్ చేసిన తర్వాత, సర్వే చేసిన వ్యక్తి యొక్క eKYC తీసుకోవాలి. బయోమెట్రిక్/ఐరిష్/OTP ద్వారా eKYC పూర్తి చేయాలి. వాలంటీర్ సర్వే చేసే సమయంలో అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది eKYC తీసుకోవాలి. ఆ తర్వాత, సర్వే చేసిన వాలంటీరు కూడా eKYC చేస్తే, ఆ ఇంటికి Section-2 సర్వే పూర్తి అయినట్లు అర్థం.
For More :
ఆడదాం ఆంధ్ర సర్వే చేయు విధానం
ప్రభుత్వ పథకాలు మరియు నిత్యజీవితంలో ఉపయోగకరమైన పోస్టుల కొరకు దిగు లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్, what's up గ్రూప్లో జాయిన్ అవ్వండి :