ఆడుదాం ఆంధ్ర సర్వే ను చేయు విధానము | Aadudam Andhra Survey by Grama Ward Volunteers | Telugu Public
ఆడుదాం ఆంధ్ర సర్వే చేయు విధానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సంబంధించి వివరాలు సేకరించడానికి గ్రామ,వార్డు వాలంటీర్ల ద్వారా సర్వే చేయించడానికి నిర్ణయం తీసుకుంది . ఈ సర్వేలో భాగంగా, వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, ఆటగాళ్ళుగా లేదా ప్రేక్షకులగా పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరిస్తారు.
సర్వే చేయు ముందు వాలంటీర్లకు గమనికలు
- 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు గల వారు ఆటగాళ్ళుగా రిజిస్టర్ చేయడానికి అర్హులు.
- 8 సంవత్సరాల పైబడిన వారు అందరూ కూడా ప్రేక్షకులుగా రిజిస్టర్ చేయడానికి అర్హులు.
- డిసెంబర్ 4 నుండి సోమవారం నుండి ఆడదాం ఆంధ్ర సర్వే ప్రారంభమవుతుంది.
సర్వే చేయు విధానం
దశ 1:
- గ్రామ వార్డు వాలంటీర్లు కొత్తగా అప్డేట్ అయిన GSWS Volunteer మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత, "ఆడుదాం ఆంధ్ర" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
దశ 2:
- వాలంటీర్ల క్లస్టర్ పరిధిలోని 15-60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారి పేర్లు లిస్టులో కనిపిస్తాయి.
- సర్వే చేయాలనుకునే వ్యక్తి పేరుపై క్లిక్ చేయాలి.
దశ 3:
- పేరుపై క్లిక్ చేయగానే, ఆటల వారీగా నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి బహుమతుల వివరాలు కనిపిస్తాయి.
ప్రశ్న 1:మీరు కూడా ఈ ఆటలు పోటీలో పాల్గొనదలుచుకున్నారా ?
అవును / కాదు
ప్రశ్న 1. a: ఈ క్రింద చూపిన ఆటలలో ఏవైనా ఒకటి లేదా రెండు ఆటలు ఎంచుకోండి.
- క్రికెట్,
- వాలీబాల్,
- కబడ్డీ,
- ఖో ఖో మరియు
- బాడ్మింటన్
ప్రశ్న 1.b:ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
ప్రశ్న 2:పైన చూపించిన ఆటలు కాకుండా ఈ క్రింది చూపించిన ఏవైనా ఆటల్లో మీరు పాల్గొన దలుచుకున్నారా ?
- 2K / 3K మారథాన్ రన్
- యోగ
- టెన్నికాయల్
- ప్రాంతీయ ఆటలు
ప్రశ్న 3 ప్రేక్షకులుగా పాల్గొనటానికి పౌరుడిగా సమాచారం అందించారా ?
అవును లేదా కాదు అని సెలెక్ట్ చేయాలి.
అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత చివరగా Submit పై టిక్ చేయాలి.
ఆడుదాం ఆంధ్ర వాలంటీర్ సర్వే రిపోర్ట్ కొరకు దిగు లింకుపై క్లిక్ చేయండి.
Report Click here
Majji kanchinaidu
ReplyDelete