జగనన్న సురక్ష వాలంటీర్ సర్వే యాప్ విడుదల
- అవును
- కాదు
- అవును
- కాదు
- అవును
- కాదు
- అవును
- కాదు
- వైఎస్ఆర్ రైతు భరోసా
- వైఎస్ఆర్ సున్నా వడ్డీ (ఎస్.హెచ్.జిలు)
- జగనన్న అమ్మఒడి
- వైఎస్ఆర్ ఆసరా
- వైఎస్ఆరపెన్షన్ కానుక
- వైఎస్ఆర్ షాదీ తోఫా/వైఎస్ఆర్ కళ్యాణమస్తు
- జగనన్న విద్యా దీవెన
- వసతి దీవెన
- వైయస్సార్ చేయూత
- జగనన్న తోడు
- జగనన్న చేదోడు
- వైయస్సార్ ఆరోగ్యశ్రీ
- దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు
- చెల్లింపు సంబంధిత సమస్య
- 6 దశల ధృవీకరణ సంబంధిత సమస్య: బహుళ పారామీటర్ ఎంపిక కోసం డ్రాప్‌డౌన్‌ను అందించండి
- దరఖాస్తు చేయడానికి పత్రాలు లేవు
- అవును
- కాదు
- వృద్ధాప్య పింఛ
- ఒంటరి మహిళ
- వితంతు పింఛను
- వికలాంగుల పింఛను
- చేనేత పింఛను
- కల్లు గీత కార్మికుల పింఛను
- మత్స్యకార పింఛను
- డప్పు కళాకారుల పింఛను
- సాంప్రదాయ చెప్పులు కుట్టేవారి పింఛను
- ట్రాన్స్ జెండర్ పింఛను
- అవును
- కాదు
- కుల ధృవీకరణ పత్రం (ఇంటిగ్రేటెడ్ నివాసం మరియు కులం)
- ఆదాయ ధృవీకరణ పత్రం
- జనన ధృవీకరణ పత్రం
- మరణ ధృవీకరణ పత్రం
- లావాదేవి కొరకు మ్యూటేషన్/సవరణల కొరకు మ్యూటేషన్
- ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC)
- అధార్ నెంబరుకు మొబైల్ నెంబరు అనుసంధానం చేయడం
- సి.సి.ఆర్.సి కార్డు
- House Hold Split (కుటుంబ సభ్యుల మార్పు చేర్పులు)
- (Addition / Split of Rice Card) బియ్యం కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం & తొలగించడం.
- ఇతరములు_.
- అవును
- కాదు
జగనన్న సురక్ష కార్యక్రమం విధి విధానాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో ధ్రువీకరణ పత్రాలు చాలా ముఖ్యం. చాలామంది ప్రజలు సరైన ధ్రువీకరణ పత్రాలు పొందలేక అర్హత ఉండి కూడా వివిధ పథకాలకు లబ్ధి పొందలేకపోతున్నారననే ఉద్దేశంతో ప్రజలు పూర్తిస్థాయి సంతృప్తి చెందే విధంగా ఇంటింటికి జల్లెడ పడుతూ లబ్ధిదారులకు గుర్తించే ముఖ్య ఉద్దేశంతో జూన్ 23 నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా వాలంటీర్లు ప్రతి ఇంటి కి వెళ్లి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలు మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తారు. ఈ మొబైల్ యాప్ లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాబడతారు. ఈ సర్వే ద్వారా ఎవరైనా అర్హులు మిగిలిన యెడల వారి యొక్క వివరాలు యాప్ లో నమోదు చేసి వారికి అవసరమైనటువంటి ధ్రువీకరణ పత్రాల కొరకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని వాటి వివరాలు నమోదు చేస్తారు. ఈ మొత్తం కార్యక్రమం దశలవారీగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
I.మొదటి దశ (June-23 నుండి June-30వరకు):-
ఈ దశలో ఇంటింటికి వాలంటీర్లు వెళ్లి ఆ ఇంట్లో ఎవరికైనా పథకం అర్హత ఉండి ఏవైనా పత్రాలు లేనియెడల వాటికి సంబంధించిన దస్త్రాలు అన్ని తీసుకొని సిద్ధం చేస్తారు.ఈ దశ లో వాలంటీర్లు మరియు గృహసారదులు ఇంటింటికీ వెళ్తారు.ఈ మొదటి దశలో ప్రతి ఒక్క వాలంటీర్ కు ఒక మొబైల్ యాప్ ను ప్రభుత్వం వారు ఇస్తారు. ఈ మొబైల్ యాప్ ను ఉపయోగించి ప్రతి వాలంటీరు వాళ్ళ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి అందులో ఉన్న ప్రశ్నలను అడిగి ఈ మొబైల్ యాప్ లో నమోదు చేస్తారు. దీనితోపాటు ఒక పాకెట్ క్యాలెండర్ ను సిటిజెన్ కు ఇచ్చి ఫోటో తీసుకుంటారు. వాలంటీర్లు తమ పరిధిలో అన్ని ఇండ్లకు సర్వే పూర్తి చేసి మొత్తం ఎన్ని ఇండ్లలో ధ్రువీకరణ పత్రాలు అవసరమగునో వారికి సంబంధించిన వివరాలు సచివాలయమునకు సమర్పించి ప్రతి ఒక్కరికీ ఒక టోకెన్ ను తీసుకోవాలి. ఈ టోకెన్ ను రెండవ దశలో ఏర్పాటు చేయు క్యాంప్ నందు ఉపయోగించి ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయుటకు సహకరించాలి. ఒకవేళ వాలంటీర్ వెళ్లే సమయంలో ఆ ఇంటికి తాళం వేసి ఉన్న యెడల మరల వారు ఉన్న టైం చూసుకుని ఆ ఇంటికి వెళ్లి సర్వేను పూర్తి చేయాలి.
ఈ కార్యక్రమం ద్వారా పౌరులకు అందించే ముఖ్య ధ్రువీకరణ పత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రము
- ఆదాయ ధ్రువీకరణ పత్రము
- జనన ధ్రువీకరణ పత్రము
- మరణ ధ్రువీకరణ పత్రము
- వివాహ ధ్రువీకరణ పత్రము
- కుటుంబ సభ్యులను ధ్రువీకరణ పత్రము
- మ్యుటేషన్ లావాదేవీలు
- ఆధార్ ఫోన్ నెంబర్ అనుసంధానము
- పంట సాగు హక్కు కార్డు (CCRC)
పైన తెలిపిన ధృవీకరణ పత్రాలకు మరియు ఏదైనా పథకాలకు అర్హత లేనియెడల ఆ విషయమై సంబంధిత పౌరులకు సున్నితంగా చెప్పి వివరించాలి.
II.రెండవ దశ (July -01 నుండి July - 23 వరకు):-
రెండవ దశలో మండల స్థాయిలో రెండు టీంలు అనగా ఎంపీడీవో గారు ఒక టీమ్ గా, ఎమ్మార్వో గారు ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి సచివాలయానికి ఈ మండల స్థాయి టీంలు వచ్చి క్యాంపును ఏర్పాటు చేస్తాయి. ఈ క్యాంపులో ముందుగా వాలింటీరు చేసిన సర్వే వివరాలు ప్రకారం ఏ ఇంటికైతే సరైనటువంటి ధ్రువీకరణ పత్రాలు లేవో ముందుగా వసూలు చేసిన లిస్ట్ ప్రాప్తికి క్యాంపు రోజు ఆ కుటుంబాలకు ఆ సర్టిఫికెట్స్ మంజూరయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటారు.
III.మూడవ దశ:-
తదుపరి ధ్రువీకరణ పత్రాలు పొందిన వారు అర్హత ఉండి ఏదైనా పథకం అందని పక్షం లో వారికి ఆ పథకానికి సంబంధించి లబ్దిని చేకూరుస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమకు అవసరమగు ధ్రువీకరణ పత్రాలు వాలంటీర్ మీ ఇంటికి వచ్చే సందర్భంలో జాగ్రత్తగా తెలియజేసి ఆ ధృవీకరణ పత్రాలు పొందే వరకు వాలంటీరుతో అనుసంధానం చేసుకుంటూ మీ పనిని పూర్తి చేసుకోవాలి.
-----------------------------••••••-------------------------------
ప్రభుత్వ పథకాలు మరియు నిత్యజీవితంలో ఉపయోగకరమైన పోస్టుల కొరకు దిగు లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్, what's up గ్రూప్లో జాయిన్ అవ్వండి. :
Follow Us On :