మీ యొక్క విద్యుత్ వినియోగం వివరాలు తెలుసుకోవడం ఎలా?
⚡ ప్రస్తుతం అమ్మ ఒడి పథకానికి సంబంధిచి ప్రతి నెల 300 యూనిట్ల( గడిచిన 12 నెలల సరాసరి 300 యూనిట్లు దాటకూడదు)విద్యుత్ వినియోగం మించరాదు. ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్న అన్ని పథకాలకు ఈ నియమము వర్తిస్తుంది. అయితే మీ సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ తో మీ electricity consumption వివరాలు తెలుసుకోవచ్చు.[For govt schemes 300 units/month limit]. పూర్తి వివరాలు దిగువున వివరించబడినాయి.👇
I.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, మరియు వెస్ట్ గోదావరి జిల్లాలు(పాత జిల్లాలు)వారికి:-
ఈ జిల్లాల వారికి విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థ APEPDCL.
ముందుగా దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చెయ్యండి.
Link 👉 Click here
పైన లింక్ పై క్లిక్ చేయగానే ఓపెన్ అయిన స్క్రీన్ పై కనపడుతున్న విధంగా మీరు వినియోగిస్తున్న విద్యుత్ బిల్లుల వివరాలు తెలియటం కోసం మీ కరెంటు మీటర్ సర్వీస్ నెంబరు లేదా మీ యొక్క సర్వీస్ కు లింక్ అయిన మొబైల్ నెంబరు లేదా మీ ఆధార్ నెంబర్ తో తెలుసుకోవచ్చు. అది ఏవిధంగో ఇప్పుడు చూద్దాం.
Service number :-
అప్పుడు మీయొక్క విద్యుత్ వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఓపెన్ అవుతాయి. అక్కడ కనిపిస్తున్న "Consumption And Payment History" పై క్లిక్ చెయ్యండి.
అప్పుడు అక్కడ కనిపిస్తున్న స్క్రీన్ పై ముందుగా సంవత్సరమును ఎంపిక చేసుకోండి. తరువాత VIEW అనే బటన్ పై క్లిక్ చేయగానే ఆ సంవత్సరంలో మీ విద్యుత్ వినియోగం మొత్తం ఓపెన్ అవుతాయి అనగా నెల, ఆ నెలలో మీరు వాడిన విద్యుత్ యూనిట్స్, ఆ నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు,మొదలగు వివరాలు చూసుకోవచ్చు.
(Phone Number )ఫోన్ నంబర్ ఆధారంగా:-
మీ సర్వీస్ నెంబరు మీకు గుర్తు లేకపోతే మీ సర్వీస్ నెంబర్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉపయోగించి మీ విద్యుత్ వినియోగానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ముందుగా పైన లింక్ పై క్లిక్ చేయగానే స్క్రీన్ పై కనబడుతున్నట్లు మీ మొబైల్ నెంబర్ ను టైప్ చేయగానే , మీకు ఒక ఓటిపి వస్తుంది , ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యూ అనే ఆప్షన్ పై కొట్టగానే మీ యొక్క విద్యుత్ వినియోగ సంబంధించి పూర్తి వివరాలు పైన తెలిపిన విధంగా ఓపెన్ అవుతాయి.
ఆధార్ నంబర్ ఉపయోగించి :-
ఒకవేళ మీ సర్వీస్ నెంబర్ మీకు తెలియకపోతే మీరు మీ ఆధార్ నంబర్ ను ఉపయోగించి విద్యుత్ వినియోగ అనేక సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. పైన తెలిపిన విధంగా మొదటి లింక్ పై క్లిక్ చేయగానే కనిపిస్తున్న స్క్రీన్ పై మీ ఆధార్ నెంబర్ ను టైప్ చేసి తరువాత అక్కడ కనిపిస్తున్న లెక్క(ప్రశ్న)కు సమాధానం ను నింపిన వెంటనే అక్కడ కనపడుతున్న VIEW అనే బటన్ పై క్లిక్ చెయ్యండి.అప్పుడు మీ ఆధార్ నంబర్ తో ఎన్నైతే కరెంటు మీటర్లు తీసుకున్నారో అన్నిటి యొక్క వివరాలు కనిపిస్తాయి. అందులో మీకు కావలసిన కరెంటు మీటర్ నంబర్ పై క్లిక్ చేయగానే పైన తెలిపిన విధంగా మరల పూర్తి వివరాలు కనిపిస్తాయి.
నోట్:- మీ యొక్క ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకున్న ఎడల మీ పేరు మీద ఎన్ని మీటర్లు నమోదు అయినవో తెలుస్తుంది.ఒకవేళ మీ ఆధార్ తో తప్పుగా ఏదైనా కరెంటు మీటర్ నమోదు అయిన ఎడల వాటిని విద్యుత్ శాఖ వారిని సంప్రదించి తొలగించుకోవాలి.
కృష్ణ, గుంటూరు , ప్రకాశం జిల్లాల వారి కొరకు(పాత జిల్లాలు):-
ఈ జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థ APCPDCL.
ముందుగా కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలో వారు వారి యొక్క విద్యుత్ వినియోగానికి సంబంధించిన వివరాలు తెలుసుకొనుటకు దిగు లింకుపై క్లిక్ చేయగానే ఓపెన్ అయినటువంటి స్క్రీన్ పై మీ యొక్క కరెంటు సర్వీస్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ ను ఉపయోగించి పైన తెలిపిన విధంగా మీ యొక్క విద్యుత్ వినియోగ వివరాలు తెలుసుకోవచ్చు.
లింక్ 👉 Click here
నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాల(పాత జిల్లాలు) వారి కొరకు :-
ఈ జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థ APSPDCL.
నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాల వారు వారి యొక్క విద్యుత్ వినియోగానికి సంబంధించిన వివరాలు తెలుసుకొనుటకు దిగువ లింకుపై క్లిక్ చేయగానే ఓపెన్ అయినటువంటి స్క్రీన్ పై మీ యొక్క కరెంటు సర్వీస్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ ను ఉపయోగించి పైన తెలిపిన విధంగా మీ యొక్క విద్యుత్ వినియోగ వివరాలు తెలుసుకోవచ్చు.
లింక్ 👉 Clik Here
--------------------------------------------
ప్రభుత్వ పథకాలు మరియు నిత్యజీవితంలో ఉపయోగకరమైన పోస్టుల కొరకు దిగు లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్, what's up గ్రూప్లో జాయిన్ అవ్వండి. :
Follow Us On :