How To Check JVD Status in Telugu | JVD స్టేటస్ చెక్ చేయడం ఎలా? JVD పూర్తి వివరాలు.

JVD స్టేటస్ చెక్ చేయడం ఎలా? JVD పూర్తి వివరాలు.


jvd status

  • --> 17/04/23 అనంతపురంలో జరగవలసిన వసతి దీవెన కార్యక్రమం రద్దు అయినది.
  • -->  26/04/2023 కు వాయిదా వేశారు అని సమాచారం

మీ యొక్క JVD (జగనన్న విద్య దీవెన) స్టేటస్ ను మరియు జగనన్న వసతి దీవెన స్టేటస్ ను తెలుసుకోవడానికి కింద చెప్పిన స్టెప్స్ ను ఫాలో అవ్వండి :

Step 1 : ముందుగా క్రింద ఇచ్చిన జ్ఞానభూమి వెబ్ సైట్ లింకు పై క్లిక్ చేయండి.

Link : Click Here

Step 2 : క్లిక్ చేసిన తర్వాత జ్ఞానభూమి వెబ్ సైట్ లాగిన్ (Login) ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

Step 3 : మీరు User ID లో మీ యొక్క ఆధార్ నెంబర్ నీ ఎంటర్ చేయాలి.

Step 4 : మీకు పాస్వర్డ్ తెలిస్తే ఎంటర్ చేయండి లేదా మీరు మొదటిసారి లాగిన్ అయినచో లేదా పాస్వర్డ్ మర్చిపోతే  Forget Password పై క్లిక్ చేయండి.

Step 5 : మీరు లాగిన్ అయ్యాక view,/Print ScholarShip Application Staus పై క్లిక్ చేయండి.

Step 6 : Application ID లో ఉన్న మీరు ప్రస్తుతం చదువుతున్న విద్య ఎంచుకోండి. ఎంచుకున్నకా Get Application Staus పై క్లిక్ చేయండి.

Step 7 : ఇప్పుడు మీ యొక్క డేటా కనిపిస్తుంది. కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే జగనన్న విద్యాదేవన మరియు వసతి దీవెన స్టేటస్ ని తెలుసుకోవచ్చు.

Step 8 : పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ అని ఉంటే అక్కడ ఎంత అమౌంట్ వచ్చింది అనేది చూపిస్తుంది.

Note : 

మీరు Quater Wise Details చూడవచ్చు. మరియు అక్కడ బిల్ అప్రూవ్డ్ అని ఉంటే రెండు మూడు రోజుల్లో పడుతుంది అని అర్థం. అమౌంట్ పడిన తర్వాత మీకు సక్సెస్ అని చూపిస్తుంది.

 జగనన్న వసతి దీవెనకు సంబంధించిన వివరాలు :-

జగనన్న వసతి దీవెన పథకంలో ఐటిఐ విద్యార్థులకు 10000 , పాలిటెక్నిక్ విద్యార్థులకు 15000 , మరియు ఇతర డిగ్రీ అంతకంటే ఎక్కువ కోర్సులుకు 20,000 .అర్హత ఉన్న ప్రతి స్టూడెంట్ కు సంవత్సరానికి హాస్టల్ మరియు ఆహారం ఖర్చులకు అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం.

 జగనన్న విద్యాదేవన పథకానికి సంబంధించిన వివరాలు:-

- జగనన్న విద్యా దేవన పథకం ఐటిఐ (ITI) నుండి పీహెచ్డీ (Ph.D) వరకు చదువుకుంటున్న BC , SC ,ST ,EBC (కాపులు మినహా) విద్యార్థులలో అర్హులైన   ప్రతి ఒక్కరికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయడమే లక్ష్యం.

పైన తెలిపిన  రెండు పథకాలకు అర్హత ప్రమాణాలు :

ఈ పథకాలు క్రింద ఆర్థిక సహాయం పొందాలంటే లబ్ధిదారులకు ఈ క్రింద తెలిపిన అర్హతలు కలిగి ఉండాలి.

1. నివాసం :

    • ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత నివాసం ఉంటున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది

2. కుటుంబ ఆదాయం :

    • కుటుంబం యొక్క ఆదాయం 2.5 లక్షలు ఉండాలి లేదా అంతకన్నా తక్కువ అయిన ఉండాలి.

3. మొత్తం కుటుంబానికి భూమి :

    • ఈ యొక్క లబ్ధిదారులకు కుటుంబం మొత్తానికి వ్యవసాయ భూమి మాగాని అయితే పది ఎకరాలు లోపు ఉండాలి మెట్టు అయితే 25 ఎకరాల లోపు ఉండొచ్చు. మాగాని మరియు మెట్ట రెండు కలిపి 25 ఎకరాలు లోపు ఉండొచ్చు.

4. ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షన్ దార్లు:-

    • లబ్ధిదారుడి కుటుంబంలో ఏ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ ఉండకూడదు. ఈ  నియమం పారిశుద్ధ్య కార్మికులు మరియు వారి కుటుంబసభ్యులకు మినహాయించబడినది.

5.హాజరు శాతం ( Attendence Percentage) :-

    • ఈ పథకాలు పొందే ప్రతి లబ్ధిదారులకు 75% శాతం Attendence ఉండాలి.

6.వాహనాలు :-

    • ఈ పథకం పొందే లబ్ధిదారులు కుటుంబంలో ఎవరు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. ( ట్రాక్టర్లు,                టాక్సీలు, ఆటోలు ఈ నియమం నుండి మినహాయింపు).

7. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి :-

  • కుటుంబం లో ఎవరి పేరుమీద ఎటువంటి ఆస్తి లేకపోయినా లేదా 1500 చ.అల స్థలం కంటే తక్కువ కలిగి ఉండాలి.

8. ఆదాయపు పన్ను (Income Tax) :

    • లబ్ధిదారులు కుటుంబం లో ఎవరైనా ఆదాయం పన్ను కట్టినచో ఈ పథకానికి అనర్హులు .

9.కోర్సులు పూర్తి :

    •కాలేజ్' / యూనివర్సిటీలు లేదా గుర్తించబడిన విద్యాసంస్థలలో విద్యార్థులు రెగ్యులర్ కోర్సులలో(Regular Courses)         ప్రవేశం పొంది ఉండాలి.

10. అర్హత గల కోర్సులు :

    • B. Pharmacy, B.Tech , Polytechnic , B.Ed , ITI , M. Tech , M. Pharmacy , MBA , PG             MBA, Other Degrees.

• Note: PG కోర్సులకు సంబంధించిన ప్రభుత్వ యూనివర్సిటీ (Under Government) కాలేజీల్లో చదివే వారు మాత్రమే ఈ పథకాలకు అర్హులు.

11. ఈ పథకానికి అర్హత గలా విద్యాసంస్థలు. :

  • ప్రభుత్వం యొక్క సహాయం పొందే (ఎయిడెడ్).
  • రాష్ట్ర యూనివర్సిటీలు కు ( Affiliated Colleges) అనుబంధంగా ఉన్న ప్రైవేటు కాలేజీలు/ బోర్డలు,
  • డే స్కాలర్(Day Scholar ) విద్యార్థులు, కాలేజీలకు అనుసంధానించబడిన హాస్టల్(College Own Hostles) విద్యార్థులు (CAH) , మరియు సంబంధిత శాఖకు' అనుసంధానించే బడిన హాస్టల్' విద్యార్థులు (DAH)

12. Documents :

  • • రేషన్ కార్డ్
  • • కాలేజీ ఎంటర్న్స్ పత్రాలు.
  • • విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వివరాలు.
  • • ఆధార్ కార్డ్ .

13. కులం :

    • బీసీ, ST, EBC , SC (కాపులు మినహా) , మైనారిటీ కాపు మరియు వికలాంగులు కేటగిరీలు కు చెందిన విద్యార్థిని     విద్యార్థులు అర్హులు.

14. లింగం మరియు వయసు :

    • ఈ పథకాలకు బాల బాలికలు ఇద్దరు అర్హులే .

15. అనర్హతలు :

  • • ప్రైవేటు యూనివర్సిటీలు/ డీమ్డ్ యూనివర్సిటీలలో (University) చదువుతున్న విద్యార్థులు (ప్రభుత్వ కోటామినహా). 
  • • కరెస్పాండెన్స్ కోర్సు (Correspondence Course) విధానంలోనూ, 
  • • దూర విద్యా' విధానంలోనూ చదువుతున్న విద్యార్థులు .
  • • మేనేజిమెంట్ (Management)/ NRI కోటాలో అడ్మీషన్' పొందిన విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.

జగనన్న వసతి దీవెన మరియు విద్యా దీవెన మన ఏపీ గవర్నమెంట్ విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్ బట్టి చూసుకుంటే :

  1.  - ఏప్రిల్ లో జగనన్న వసతి దీవేన మొదటి విడత.
  2. - మే లో జగనన్న విద్యా దీవేన రెండవ విడత.
  3. - అక్టోబర్ లో జగనన్న వసతి దీవేన రెండవ విడత.
  4. - నవంబర్లో జగనన్న విద్యా దీవేన మూడో విడత. 
  5. - ఫిబ్రవరిలో (2024) జగనన్న విద్యా దేవేన మరొక విడత.

Note : పైన తెలిపిన షెడ్యూల్ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా మారుతూ ఉండొచ్చు.

You Might Like This :

మీరు మీ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నారా?చేసుకోకపోతే వెంటనే చేసుకోండిలేకపోతే రాబోవు కాలంలో ఆధార్ కి సంబంధించిన అన్ని సేవలు నిలుపుదల చేసే  ప్రమాదం ఉంది. : Click Here

Sankshema Calendar 2023-24 | ఏ నెలలో ఏ పథకాలు అమలు అవుతాయి తెలుసుకోండి. : Click Here

Post a Comment

Previous Post Next Post