లింగాష్టకం
పవిత్రమైన కార్తీక మాసం లో శివ ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.లింగాష్టకం అనేది భగవంతుడు శివుడిని ప్రార్థిస్తూ రచించిన ఆష్టకం.లింగాష్టకం రచించినది ఆది శంకరాచార్యులు .ఇందులో శివుని స్వరూపమైన లింగాన్ని కీర్తిస్తూ ఎనిమిది పద్యాలు ఉంటాయి. ఈ శ్లోకంలో శివలింగానికి శ్రద్ధగా నమస్కరించటం ద్వారా పాపవిముక్తి, పుణ్యప్రాప్తి కలుగుతాయని చెబుతుంది.
లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్
॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
ఫల శ్రుతి:
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
లింగాష్టక స్తోత్రం భక్తిశ్రద్ధలతో పఠించడం ద్వారా శివుని అనుగ్రహం మరియు శాంతి లభిస్తాయి.