"భారతీయ రోడ్లపై రైలంత పొడవైన బస్సులు త్వరలోనే"
కొద్ది రోజుల్లోనే భారతీయ రోడ్లపై రైలంత పొడవైన బస్సులు రయ్‌మని దూసుకెళ్లనున్నాయి. విదేశాల్లో ఇప్పటికే రైలు తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉండటంతో, వాటిలో వంద మందికి పైగా ప్రయాణించవచ్చు. అవి చూసినప్పుడల్లా మనం భారత్‌లో ఇలాంటివి ఎప్పుడు వస్తాయో అనుకుంటూ ఉండేవాళ్లం. అయితే, ఆ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పొడవాటి బస్సులను తీసుకురావడంపై ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నామని, ఇందుకోసం నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోందని నితిన్ గడ్కరీ తెలిపారు. చెక్ రిపబ్లిక్‌కు వెళ్లినప్పుడు, మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఉండటాన్ని చూసినట్లు చెప్పారు. అలాంటి బస్సులను భారత్‌లో కూడా ఎందుకు తీసుకురాకూడదని అనిపించిందని వివరించారు. ఈ విషయంపై చర్చలు జరిపి, టాటా సహకారంతో నాగ్‌పుర్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా, 132 మంది కూర్చునే విధంగా బస్సును రూపొందిస్తున్నామని, ఇవి ఇంధనంతో కాకుండా బ్యాటరీతో నడిచేలా తయారు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రభుత్వ పథకాలు మరియు నిత్యజీవితంలో ఉపయోగకరమైన పోస్టుల కొరకు దిగు లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్, what's up గ్రూప్లో జాయిన్ అవ్వండి :
https://youtube.com/shorts/CskfbG0bBLc?si=sCUBWsqrCkH9Ybzd
ReplyDelete