ఓటు వేస్తున్నారా అయితే ఈ విషయాల్ని తప్పక తెలుసుకోండి | Voting Day | Telugu Public

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13న జరిగే ఎన్నికలలో ఓటు వేయడం ఎలా?

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సంఘం ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓటు వేసే ప్రక్రియ ఎలా ఉంటుందో, ఓటర్లు ఏం చేయాలో తెలుసుకోండి.

ఓటు వేయడానికి అర్హత:

  • 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి అర్హులు.
  •  ఓటర్ల జాబితాలో పేరు నమోదు అయి ఉండాలి.

ఓటు వేయడానికి ముందు:

  • మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోండి. ఎలక్షన్ కమీషన్ వెబ్‌సైట్ లేదా సీవిజిల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
  •  మీ గుర్తింపు కార్డు సిద్ధంగా ఉంచుకోండి.

ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు:

  • పోలింగ్ కేంద్రం దగ్గర పార్టీల గుర్తులు, రంగులు కలిగిన బట్టలు, టోపీలు ధరించకండి.
  •  సెల్‌ఫోన్లు తీసుకెళ్లకండి.
  •  అక్కడుండే భద్రతా సిబ్బందికి సహకరించండి.

ఓటు వేసే ప్రక్రియ:

  1. ఓటర్ లిస్ట్‌లో మీ పేరు, గుర్తింపు కార్డు చూసి అధికారులు మిమ్మల్ని పోలింగ్ బూత్ లోకి పంపుతారు.
  2. మీ ఎడమచేతి చూపుడు వేలు చెక్ చేసి దానికి సిరా వేస్తారు.
  3. రిజిస్టర్‌లో మీ వివరాలు నమోదు చేసి స్లిప్ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు.
  4. పోల్‌ చీటీ తీసుకుని కంట్రోల్‌ యూనిట్‌ (సీయూ) దగ్గరికి వెళ్లి ఓటు వేయండి.
  5. సీయూలో బటన్ నొక్కిన తర్వాత మీరు ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది.

ఓటు వేయడంలో ఇబ్బంది ఉంటే:

 ఓటు వేయడంలో ఏవైనా ఇబ్బందులున్నా, మీ ఓటు మరొకరు వేసినా వెంటనే పోలింగ్ ఆఫీసర్‌‌కు ఫిర్యాదు చేయండి.

పోలింగ్ సమయం:

  • ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
  • ఏ టైంలో అయినా వెళ్లి ఓటు వేయొచ్చు.

ప్రచారాలకు సమయం ముగియడం తో అమల్లోకి ఆంక్షలు

  1. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది.
  2. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
  3. ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు.
  4. ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు (మే 11 సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు) వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధం.
  5. పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు డేగ కన్ను వేస్తారు.
  6. ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం.
  7. మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం నిషిద్ధం.
  8. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.

ఓటు హక్కును వినియోగించుకోండి!

మీ ఓటు చాలా విలువైనది. మీ ఓటుతో మీరు ఎవరిని అధికారంలోకి తీసుకురావాలో నిర్ణయించుకోవచ్చు. ఈ నెల 13న తప్పకుండా ఓటు వేయండి. JAI HIND


Post a Comment

Previous Post Next Post