మీ యొక్క కరెంటు బిల్లు అధికారిక వెబ్సైట్లో ఇలా సులువుగా కట్టేయండి.
ఆంధ్రప్రదేశ్ లో కరెంటు బిల్లులను ఫోన్ పే ,గూగుల్ పే మరియు ఇతర ఆన్లైన్ ఫ్లాట్ ఫాం లలో కట్టే వారు కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యుత్ సంస్థలన్నీ అటువంటి ప్రైవేటు ఆప్ లలో కట్టడం నిషేధించి కేవలం ఆ సంస్థ వెబ్సైట్లలో లేదా ఆ సంస్థ విడుదల చేసిన యాప్ లలో మాత్రమే కట్టే వెసులుబాటును కల్పించింది. అయితే ఎటువంటి లాగిన్ లేకుండా వెబ్సైట్లో మీ ఫోన్లోనే కట్టుకునే విధానం దిగువున వివరించబడింది.
I.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, మరియు వెస్ట్ గోదావరి జిల్లాలు(పాత జిల్లాలు)వారికి:-
ఈ జిల్లాల వారికి విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థ APEPDCL.
Step 1: ముందుగా దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చెయ్యండి.
Link 👉 Click here
Step 2 :పైన లింక్ పైన క్లిక్ చేయగానే పై ఉన్న ఫోటో లో ఉన్నట్టుగా పేజీ ఓపెన్ అవుతుంది,అక్కడ మీ యొక్క సర్వీస్ నెంబర్ ని టైప్ చేయండి మరియు అక్కడ ఉన్న ప్రశ్న కు జవాబును ఇవ్వండి.
Step 3 : ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ (Submit )పై క్లిక్ చేయండి.
Step 4:సబ్మిట్ పే క్లిక్ చేసిన తర్వాత మీరు వేరే page కు రి డైరెక్ట్ అవుతారు(Like Above Image) అక్కడ మీ యొక్క డీటెయిల్స్ కనబడతాయి.
Step 5: తర్వాత క్లిక్ హియర్ టు (Click Here To Pay )పై క్లిక్ చేయండి.
Step 6: అప్పుడు మీకు పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కనబడే వివిధ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్లలో మీకు ఏది అనుకూలంగా ఉంటుందో దానిని ఎంచుకొని మీయొక్క బిల్లును పే చేయవచ్చు.
అదేవిధంగా మిగిలిన జిల్లాల యొక్క విద్యుత్ సంస్థల వెబ్సైట్లు దిగువున ఇవ్వబడింది. వాటిలో కూడా పైన తెలిపిన విధంగానే పేమెంట్ చేయవచ్చు.
2.నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాల(పాత జిల్లాలు) వారి కొరకు :-
ఈ జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థ APSPDCL.
లింక్ 👉 Clik Here
3.కృష్ణ, గుంటూరు , ప్రకాశం జిల్లాల వారి కొరకు(పాత జిల్లాలు):-
ఈ జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థ APCPDCL.
లింక్ 👉 Click here
ప్రభుత్వ పథకాలు మరియు నిత్యజీవితంలో ఉపయోగకరమైన పోస్టుల కొరకు దిగు లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్, what's up గ్రూప్లో జాయిన్ అవ్వండి :
Postlu petandi Sivaji Garu
ReplyDelete