Disciplinary Case Data Base(DCDB) And Regularisation Case Data Base(RCDB)(అపాయింటింగ్ అథారిటీ లేదా డిస్ప్లేనరి అథారిటీ మ్యాపింగ్) ఏ విధంగా చేస్తారు?

 

Appointing Authority/Disciplinary Authority Mapping ( అపాయింటింగ్ అథారిటీ లేదా డిస్ప్లేనరి అథారిటీ మ్యాపింగ్) ఏ విధంగా చేస్తారు?

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంత మంది DDO లు అత్యవసరంగా చేయవలసిన కార్యక్రమాలలో HERB PORTAL నందు Disciplinary Cases నందు Appointing Authority/Disciplinary Authority Mapping ( అపాయింటింగ్ అథారిటీ లేదా డిస్ప్లేనరి అథారిటీ మ్యాపింగ్) చెయ్యడం ఇప్పుడు ఎలాగో తెలుసుకుందాం.

STEP 1 :-

 ముందుగా దిగువ తెలిపిన హెర్బ్ పోర్టల్ నందు డిడిఓ తమ యొక్క User name and Password తో లాగిన్ కావాలి.

https://herb.apcfss.in/home

STEP 2:- 

లాగిన్ అవ్వగానే తరువాత Master Data పై క్లిక్ చేయండి. అందులో Master Data Updation నందు మొదట కనిపించే "Disciplinary Cases" పై క్లిక్ చేయండి.

STEP 3 :- 

అక్కడ కనిపించే DDO Code దిగువున గల drop down list నందు కనిపించే మీ కార్యాలయం వివరాలు పై క్లిక్ చేసి "Get Data" పై క్లిక్ చేయండి. అక్కడ మీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు మొత్తం కనిపిస్తాయి.

STEP 4 :- 

దిగువ తెలిపిన వివరాలు మీకు కనిపిస్తాయి.  

1.S.No. 

2.Employee ID

3.Name 

4.Designation 

5.Is the Appointing authority / Disciplinary Authority is in the same office 

6.Appointing authority DDO code

పైన తెలిపిన వివరాలలో "Is the Appointing authority / Disciplinary Authority is in the same office" అని ఆప్షన్ దిగువన ప్రతి ఉద్యోగికి Yes లేదా No అని కనిపిస్తుంది.అంటే ఎవరైనా ఉద్యోగి అపాయింట్మెంట్ అథారిటీ కార్యాలయంలోనే పని చేసుకుంటే Yes అని పెట్టాలి, లేకపోతే No అని పెట్టాలి.

ఉదాహరణకు సచివాలయం లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు వాలంటీర్లకు పంచాయతీ కార్యదర్శి డి డి వో గా వ్యవహరిస్తున్నారు. కానీ వారి అందరికీ Appointing authority / Disciplinary Authority మండల పరిషత్ అభివృద్ధి అధికారి(MPDO) కావున ఇక్కడ No అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

STEP 5 :- 

YES లేదా NO అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోగానే అక్కడ DEPARTMENT అడుగుతుంది.

ఉదాహరణకు సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ను ఎంపిక చేసుకుంటారు. తరువాత జిల్లాను ఎంపిక చేసుకోవాలి. జిల్లాను ఎంపిక చేసుకున్న వెంటనే చివరగా డిడిఓ కోడ్ ఎంపిక చేసుకోవాలి. అనగా వారి యొక్క మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం యొక్క డిడిఓ కోడ్ ను ఎంపిక చేసుకోవాలి. తరువాత Save మీద క్లిక్ చెయ్యాలి.

ఈ విధంగా ఆ కార్యాలయంలో ఉన్న అంత మంది సిబ్బంది వివరాలు నమోదు చేసిన తర్వాత మరల పైన కనిపిస్తున్న Get Data మీద క్లిక్ చేయగానే  Appointing authority DDO Code దగ్గర DDO కోడ్ చూపిస్తుంది.

అదేవిధంగా "Enter Disciplinary Cases" అనే ఆప్షన్ కొత్తగా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఓపెన్ అవుతాయి. ఏదైనా ఉద్యోగి మీద  Disciplinary Cases ఉన్నట్లయితే ఆ వివరాలు నమోదు చెయ్యాలి. ఏమీ లేనట్లయితే No అని నమోదు చేసి Save చేస్తారు.

పైన తెలిపిన అంశాలు మాకు తెలిసిన పరిజ్ఞానము మరియు అవగాహనతో తెలియజేసినవి పూర్తి వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించగలరు..

Post a Comment

Previous Post Next Post