అమ్మబడి కాల పట్టిక - 2023
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలలో అత్యంత ముఖ్యమైనది అమ్మఒడి. తల్లిదండ్రులు తమ పిల్లలను బాల్య దశలోనే చదువులు మధ్యలోనే నిలిపివేసి డబ్బులు సంపాదన కోసం ఇతర పనులలో చేర్పిస్తున్నారు . అలాంటి పరిస్థితుల నుండి విద్యార్థులను విముక్తి కల్పించి పాఠశాలకు దగ్గర చేసే నిమిత్తం విద్యార్థుల తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే మూడు దశలు అమలు చేయగా నాలుగవ దశ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో నిర్దిష్ట టైం టేబుల్ ను విడుదల చేసింది. ముఖ్యంగా మే మరియు జూన్ మాసాలలో ఏ ఏ తేదీలలో ఏమి చేయాలో దిగువన వివరించబడింది. అంతమంది దాని ఆధారంగా మీరు మీ వాలంటీర్ని గాని సచివాలయ సిబ్బందిని గాని కలిసి ఎందుకు తెలిపిన అంశాలు పూర్తి చేసుకోగలరని కోరుచున్నాము.
అమ్మ ఒడి అర్హతలు:-
అమ్మ ఒడి - 2023 పథకం మీకు రావాలి అంటే దిగువ తెలిపిన అర్హతలు కచ్చితంగా ఉండాలి.
1. ప్రతి విద్యార్థికి 75% హాజరు తప్పనిసరి (2022 అక్టోబర్ నుండి 2023 ఏప్రిల్ వరకు )
2.బియ్యం కార్డ్ ఉండాలి.
3. తల్లి(mother) మరియు విద్యార్థి ఒకే హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉండాలి.
4.విద్యార్ది EKYC చేయించాలి ( 6 సం.ల వయస్సు కలిగిన విద్యార్థులకు ఆధార్ సెంటర్లో ఫింగర్ అప్డేట్ చేయించాలి మరియు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ లింక్ చెయ్యాలి )
5. తల్లి యొక్క బ్యాంక్ ఎకౌంటు ఏ బ్యాంకులో ఉందో తెలుసుకొని ఆ బ్యాంకుకు వెళ్లి NPCI చేయించాలి. ( తల్లి బ్యాంకు అకౌంట్ కు ఆదార్ ఫోన్ నెం లింక్ అవ్వాలి )
6. బ్యాంకు A/C రన్నింగ్ లో ఉండాలి.
అమ్మ ఒడి 2023 టైం లైన్స్(Ammavodi Timelines 2023):-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు మరియు సిబ్బందికి దిగువ తెలిపిన టైం లైన్స్ ను విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం వారు పూర్తి చేయడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులు అంతమంది దిగువ తెలిపిన తేదీల వారీగా మీ పనిని మీరు పూర్తి చేసుకోవాలి.
1). 25-05-2023 న డేటా సచివాలయాలకు EKYC కి వస్తుంది.2). 29-05-2023 కు EKYC కంప్లీట్ చెయ్యాలి.
3). 08-06-2023 కు తాత్కాలిక అర్హుల / అనర్హుల జాబితా విడుదల
4).13-06-2023 కు తుది జాబితా విడుదల
🎒 జగనన్న అమ్మఒడి 2023-24 Ammavodi Field verification ప్రశ్నలు సమాధానాలు :-
--------------------------------------------
*ప్రభుత్వ పథకాలు మరియు నిత్యజీవితంలో ఉపయోగకరమైన పోస్టుల కొరకు దిగు లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్, what's up గ్రూప్లో జాయిన్ అవ్వండి*.
Telegram :- https://t.me/telugupublic1
What's up:-
https://chat.whatsapp.com/F4JNvdC0dMK5bhGmVJdWpr