NTR భరోసా పెన్షన్ – కొత్త దరఖాస్తుల ప్రక్రియ | New Pension Applications

NTR భరోసా పెన్షన్ – కొత్త దరఖాస్తుల ప్రక్రియ

(అప్‌డేట్ తేదీ: 06-09-2026)

NTR భరోసా పెన్షన్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 06-09-2026న కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన మరియు మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. NTR భరోసా పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అనుకునేవారు ఈ కథనంలోని పూర్తి వివరాలను తెలుసుకోండి.

దరఖాస్తుల స్వీకరణ ఎలా?

  • 07-09-2026 నుంచి 16-09-2026 వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • దరఖాస్తును స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు కార్యాలయంలో సమర్పించాలి.
  • ఆధార్, రైస్ కార్డు/ఆదాయ ధృవీకరణ పత్రం మరియు సంబంధిత కేటగిరీ సర్టిఫికెట్లు ఇవ్వాలి.
  • దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, e-KYC పరిశీలన చేస్తారు.

పరిశీలన ప్రక్రియ

  1. ముందుగా దరఖాస్తుదారుడి సాధారణ అర్హతను పరిశీలిస్తారు.
  2. అర్హత ఉన్న దరఖాస్తులను భౌతిక పరిశీలనకు పంపుతారు.
  3. అధికారులు నేరుగా ఇంటికి వచ్చి పత్రాలు, అర్హతలను తనిఖీ చేస్తారు.
  4. అవసరమైతే e-KYC కూడా అక్కడికక్కడే పూర్తి చేస్తారు.
  5. తరువాత MPDO / మున్సిపల్ కమిషనర్ దరఖాస్తును పరిశీలించి అర్హత లేదా అనర్హతను నిర్ణయిస్తారు.

ఏ పెన్షన్‌కు ఎవరి ద్వారా సిఫారసు?

పెన్షన్ కేటగిరీ సిఫారసు చేసే శాఖ
వృద్ధాప్యం, వితంతువు, ఒంటరి మహిళలు, వికలాంగులుCEO, SERP
చేనేత కార్మికులుHandlooms & Textiles శాఖ
మత్స్యకారులుFisheries శాఖ
డప్పు కళాకారులుSocial Welfare శాఖ
సంప్రదాయ చెప్పుల తయారీదారులుSocial Welfare శాఖ
ట్రాన్స్‌జెండర్Health & Family Welfare శాఖ
కల్లు గీత కార్మికులు (Toddy Tappers)Prohibition & Excise శాఖ

ముఖ్యమైన విషయం: MPDO / మున్సిపల్ కమిషనర్ పెన్షన్‌ను నేరుగా మంజూరు చేయరు. వారు అర్హులైన దరఖాస్తులను మాత్రమే సిఫారసు చేస్తారు.

రాష్ట్ర స్థాయి ప్రక్రియ

SERP, RTGS మరియు సంబంధిత రాష్ట్ర శాఖలు తుది పరిశీలన చేస్తాయి. ఆ తరువాత SERP బడ్జెట్ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపుతుంది. ప్రభుత్వ అనుమతి మరియు బడ్జెట్ అందుబాటులో ఉన్న తరువాతే పెన్షన్ మంజూరు చేసి విడుదల చేస్తారు.

గమనిక: పెన్షన్ SERP మంజూరు చేసి విడుదల చేసే నెల నుంచే చెల్లుతుంది. దరఖాస్తు చేసిన తేదీ నుంచి గానీ, అర్హత పొందిన తేదీ నుంచి గానీ గత బకాయిలుగా చెల్లించరు.

ముఖ్యమైన తేదీలు

దశ తేదీలు
దరఖాస్తుల స్వీకరణ07-09-2026 – 16-09-2026
e-KYC17-09-2026 – 21-09-2026
సాధారణ అర్హత, భౌతిక/శాఖాపరమైన పరిశీలన22-09-2026 – 24-09-2026
MPDO/మున్సిపల్ కమిషనర్ పరిశీలన మరియు సిఫారసు25-09-2026 – 26-09-2026
బడ్జెట్ ప్రతిపాదన మరియు ప్రభుత్వ అనుమతితదుపరి దశ

అవసరమైన పత్రాలు

అన్ని కేటగిరీలకు కామన్‌గా అవసరమైనవి:

  • ఆధార్ కార్డు
  • రైస్ కార్డు / ఆదాయ ధృవీకరణ పత్రం
  • సంబంధిత ఇతర సర్టిఫికెట్లు

కేటగిరీల వారీగా ప్రత్యేక పత్రాలు:

  • వృద్ధాప్య పెన్షన్: వయస్సు రుజువుగా ఆధార్ కార్డు.
  • వితంతువు: భర్త మరణ ధృవీకరణ పత్రం + భర్త ఆధార్ నంబర్.
  • ఒంటరి మహిళ: వివాహం జరిగి ఉంటే కోర్టు/అదాలత్ నుంచి విడాకుల డిక్రీ; అవివాహిత అయితే తహసీల్దార్ నుంచి Non-Marriage Certificate.
  • వికలాంగులు: SADAREM సర్టిఫికెట్ (కనీసం 40% బెంచ్‌మార్క్ డిజేబిలిటీ).
  • చేనేత కార్మికులు: Handloom & Textile Department సర్టిఫికెట్.
  • మత్స్యకారులు: Fisheries Department సర్టిఫికెట్.
  • డప్పు కళాకారులు: Social Welfare Department సర్టిఫికెట్.
  • సంప్రదాయ చెప్పుల తయారీదారులు: Social Welfare Department సర్టిఫికెట్.
  • కల్లు గీత కార్మికులు (Toddy Tappers): Prohibition & Excise Department సర్టిఫికెట్.
  • ట్రాన్స్‌జెండర్: District Medical Board సర్టిఫికెట్.

అర్హత ఉన్నవారు 16-09-2026 లోపు తమ సమీప స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు కార్యాలయంలో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాం.

గమనిక: ఇది సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. అధికారిక వివరాల కోసం స్థానిక సచివాలయం లేదా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి.

Post a Comment

Previous Post Next Post