అమ్మ ఒడి పథకం NPCI స్టేటస్ కనుక్కొనే విధానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో అత్యంత ముఖ్యమైన పథకం అమ్మ ఒడి.ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న బాల,బాలికలలో కుటుంబం లో ఒక్కరికి ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు తల్లి ఖాతాలో జమ చేసే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం ఈ సంవత్సరం అతి కొద్ది రోజులలో తల్లి ఖాతాలలో డబ్బులు జమ చేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేస్తుంది. అయితే ఈ పథకం అర్హత సాధించినప్పటికీ కూడా కొంతమందికి డబ్బులు పడవు దానికి ప్రధాన కారణం వారి బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ చేసుకోకపోవడం, చాలామందికి NPCI లింక్ చేసుకున్నామో లేదో కూడా తెలియదు. అటువంటి వారి కోసం NPCI లింక్ ఏ విధంగా చేయాలో దిగువున పూర్తిగా వివరించబడింది.
STEP 1 :-
ముందుగా దిగువ ఇచ్చిన లింకుపై క్లిక్ చేయండి.
లింక్ 👉 Click HereSTEP 2 :-
పై లింకు పై క్లిక్ చేయగానే కనిపించే స్క్రీన్ పై ముందుగా మీ ఆధార్ నెంబర్ ను టైప్ చేసి తరువాత అక్కడ కనిపించే ఐదు అక్షరాల CAPTHA(Enter Security Code అని ఉంటుంది) ను ఎంటర్ చెయ్యండి.
STEP 3:-
తరువాత అక్కడ కనిపించే "Send OTP" మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ తో లింక్ అయినా మొబైల్ కు ఓటిపి వస్తుంది. ఆ OTP ని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చెయ్యండి.
STEP 4:-
అప్పుడు ఓపెన్ అయిన స్క్రీన్ పై ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ అయితే దిగువ విధంగా చూపిస్తుంది.
STEP 5:-
ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ కాకపోతే లేదు అనే విధంగా చూపిస్తుంది.
R.Maharaj
ReplyDeleteA Mohith
ReplyDeleteM. Jaswanth
ReplyDeleteP. Jai raj
ReplyDeleteగౌరైపండ
ReplyDeleteGOOD INFORMATION KEEP IT UP
ReplyDelete