వాలంటీర్లకు సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర అవార్డుల ఎంపిక నియమావళి


వాలంటీర్లకు సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర అవార్డుల ఎంపిక నియమావళి

Selection process of volunteers awards in Andhra Pradesh


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ వార్డు సచివాలయాలతో పాటు వాలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వాలంటీర్లు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం వాలంటీర్ అవార్డుల పేరుతో  సేవా వజ్ర,సేవారత్న, సేవా మిత్రా  పేర్లు పెట్టి Rs.30,000, Rs.20,000,  Rs.10,000  రూపాయలు అందిస్తున్నారు. అయితే చాలామందికి  ఈ అవార్డుల ఎంపిక ఏ విధంగా చేస్తారు అనేది తెలియదు, అటువంటి వారి కోసం  అవార్డుల ఎంపిక  ఏ విధంగా చేస్తారు దిగువన ఉదహరించబడింది.

అవార్డులు :- 

1.సేవ మిత్ర :- 

ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి ఫిర్యాదులు ,వివాదాలు లేకుండా పనిచేసిన 2,28,624 మందికి సేవ మిత్ర అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈ పురస్కారంలో భాగంగా సర్టిఫికెట్, సాలువ, బ్యాడ్జ్ తోపాటు Rs.10,000 నగదు బహుమానం ఇస్తారు.

2. సేవా రత్న :- 

పై నియమావళితోపాటు దిగువ ఉదహరించిన వంద మార్కులకు గాను వచ్చిన మార్కులు ఆధారంగా టాప్  1 %రాంక్ లు సాధించిన వాలంటీర్లకు ప్రతి మండలం లేదా మున్సిపాలిటీలో 5 మంది చొప్పున ,మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4220 మందికి సేవ రత్న పురస్కారాలు ప్రధానం చేస్తున్నారు. ఈ పురస్కారంలో భాగంగా సర్టిఫికెట్, సాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు Rs.20,000 రూపాయల నగదు బహుమానం ఇస్తారు.

3. సేవా వజ్ర :- 

సేవా రత్న పురస్కారం మాదిరిగానే ఎంపిక చేసి ప్రతి నియోజకవర్గం లో మొదటి ఐదు ర్యాంకులు పొందిన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 875 మందికి ఈ పుష్కారం అందిస్తారు.ఈ పురస్కారంలో భాగంగా సర్టిఫికెట్, సాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు Rs.30,000 రూపాయల నగదు బహుమానం ఇస్తారు.


సేవ రత్న మరియు సేవా వజ్ర ఎంపికకు మార్కులను ఏ విధంగా కేటాయిస్తారు:- 

సేవ రత్న మరియు సేవా వజ్ర పురస్కారాలు ఎంపిక చేయుటకు గాను మొత్తం 100 మార్కులకు దిగువ తెలిపిన విధంగా లెక్కించబడుతుంది.

1.31-01-2023 నాటికి  సంవత్సరకాలం పూర్తిగా తన సేవలను అందించి ఉండాలి.

2. ఎంపిక కాలంలో ఆ వాలంటీర్ పై ఎటువంటి ఫిర్యాదులు గాని, ఆరోపణలు గానీ ఉండకూడదు.

పై వాటితో పాటు సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ఎంపిక చేసేటప్పుడు వంద మార్కులకు దిగువ తెలిపిన విధంగా లెక్కిస్తూ ఎంపిక చేస్తారు.

1. ఆన్ లైన్ అటెండెన్స్ ( 30 మార్కులు) :- 

వాలంటీర్ పురస్కారాల ఎంపికకు పరిగణలోకి తీసుకున్న కాలంలో ప్రతి నెలకు కచ్చితంగా నాలుగుసార్లు అటెండెన్స్ వేసి ఉంటే ఆ నెలకు 100% అటెండెన్స్ గా పరిగణిస్తారు.అలా కింది ఫార్ములా ఆధారంగా  30 మార్కులకు లెక్కిస్తారు.

ఫార్ములా :- 

మార్క్స్ = [(100% హాజరు వేసిన నెలలు) X (30)]/12

ఉదాహరణకు A అనే వాలంటీర్ 10 నెలలు 100 శాతం(నెలకు నాలుగు రోజులు) హాజరు నమోదు చేసి ఉన్న ఎడల అతనికి దిగువ తెలిపిన మార్కులు వస్తాయి.

 మార్క్స్ =10 X (30/12) = 25

 అనగా 30 మార్కులకు 25 మార్కులు వచ్చినట్లు లెక్క.

Note:- నెలకు నాలుగు రోజులు హాజరు లెక్కింపు కేవలం అవార్డుల వరకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ ప్రతి వాలంటీర్ కచ్చితంగా వారానికి మూడు చొప్పున నెలకు 12 రోజులు అటెండెన్స్ వేస్తేనే అతని జీతాన్ని పెట్టడం జరుగుతుంది.

2. పింఛన్ల పంపిణీ (30 మార్కులు) :- 

పింఛన్ల పంపిణీ కి గాను  రెండు రకాలుగా విభజించారు.

i. క్లస్టర్ లో 25 పింఛన్లు కంటే తక్కువ ఉన్న వాలంటీర్ :- 

ఏ వాలంటీర్ పరిధిలో 25 కంటే తక్కువ పెన్షన్స్ ఉండి ప్రతి నెల ఒకటో తారీఖున 100% పెన్షన్ల పంపిణీ చేసినచో ఆ నెల వారికి 30 మార్కులకు 30 మార్కులు ఇస్తారు, అలా పంపిణీ చేయని లేనియెడల 15 మార్కులు ఇస్తారు.

ii. క్లస్టర్లో 25 పెన్షన్స్ లేదా అంత కంటే ఎక్కువ ఉన్న వాలంటీర్ :-

ఏ వాలంటీర్ క్లస్టర్  పరిధిలో 25 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్స్ ఉన్న ఎడల దిగువ ఫార్ములా ఆధారంగా మార్కులను కేటాయిస్తారు.

ఫార్ములా = [(1 వ రోజు  పంపిణీ చేసిన పెన్షన్ల సంఖ్య X 30)+(2,3,4,5 రోజులలో కలిపి పంపిణీ చేసిన పెన్షన్ల సంఖ్య X 20 )] / మొత్తం పెన్షన్ల సంఖ్య

ఉదాహరణకు A అనే వాలంటీర్ కు 30 పెన్షన్స్ ఉన్నాయి అనుకుందాం,1 వ రోజున 25 పెన్షన్లు పంపిణీ చేయగా మిగిలిన ఐదు పెన్షన్స్ మిగిలిన రోజులలో పంపిణీ చేశాడు అనుకుందాం. అప్పుడు అతనికి దిగు తెలిపిన విధంగా మార్క్స్ వస్తాయి.

మార్క్స్ = [(25 X 30)+(5 X 20)]/30 = 28.33

అనగా అతనికి 28.33 మార్క్స్ వస్తాయి.

3. సంతృప్తి సర్వే (Satisfaction Survey)( 20 మార్కులు):-

వాలంటీర్ కి కేటాయించిన హౌస్ హోల్డ్స్(HH) కు చేపట్టిన  ఈ సర్వే లో దిగువ ఫార్ములా ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.

 మార్క్స్ = (TOTAL HH COVERED/ TOTAL HH ASSIGNED) X 20

ఉదాహరణకు ఒక వాలంటరీ కు మొత్తం 30 HH కేటాయించి ఉంటే అందులో 25 HH ఈ సర్వేలో కవర్ అయితే అప్పుడు 

మార్క్స్  =(25/30) X 20

              =16.66

అంటే 16.66 మార్కులు వచ్చినట్లు లెక్క.

4. క్లస్టర్లు జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు(10 మార్కులు):- 

ఏ వాలంటీర్ పరిధిలో నైనా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగినప్పుడు దానికి పూర్తి స్థాయిలో హాజరై, ప్రతి ఇంటి యొక్క ఫోటోను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన యెడల దానికి పూర్తి మార్కులు 10 వస్తాయి. లేనియెడల 0 మార్కులు వస్తాయి.

Note :- ఏ సచివాలయం పరిధిలో అయితే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరగలేదో ఆ  వాలంటీర్లకు పూర్తి మార్కులు కేటాయించడం జరుగుతుంది.

5. బెనిఫిసిరి టెస్టి మోనియల్స్ (10 మార్కులు) :- 

ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన వివిధ పథకాల లబ్ధిదారుల నుండి టెస్టి మోనియల్ వీడియో అప్లోడ్ చేయుటకు గాను దిగువ ఫార్ములా ఆధారంగా 10 మార్కులు వరకు కేటాయించడం జరుగుతుంది.

ఫార్ములా = (మొత్తం టెస్టి మోనియల్ వీడియోలు కలెక్షన్ చేసినవి / టెస్టిమోనియల్ టార్గెట్) X 10

ఉదాహరణకు A అనే వాలంటీర్ కు మొత్తం టార్గెట్ 20 అనుకుంటే అందులో 10 పూర్తి చేసిన యెడల

మార్క్స్ = (10/20) X 10

             = 5

అనగా 5 మార్కులు వచ్చినట్లు.

పై విధంగా మార్కులను లెక్కించి సేవా వజ్ర , సేవారత్న అవార్డులను ఎంపిక చేస్తారు.

సేవ మిత్ర అవార్డులకు ఎవరిని అనర్హులుగా పరిగణిస్తారు:-

1. పైన తెలిపిన ఐదు రకాల విషయాలలో ఏవైనా రెండు విషయాలలో 0 మార్కులు వచ్చినయెడల వారిని సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేయరు.

2. ఆ క్లస్టర్ లో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలకు హాజరు కానీ వాలంటీర్ కి సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేయరు

3. పై అధికారుల పట్ల ప్రవర్తన సరిగ్గా లేని వారికి మరియు దురుసు ప్రవర్తన కలిగిన వారికి సేవా మిత్ర అవార్డు ఎంపిక చేయరు.

4. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి మరియు ప్రచారం చేసిన వారికి సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేయరు.

Note:- ఈ సమాచారం అందుబాటులో ఉన్న sources  నుండి తీసుకున్నాము,కేవలం అవగాహన నిమిత్తంమాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలకు గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించాల్సిందిగా తెలియజేస్తున్నాను.


Post a Comment

Previous Post Next Post