చేతులను మృదువుగా మార్చే న్యాచురల్ స్క్రబ్స్
ముఖంతో పోలిస్తే చేతులు ఎక్కువగా డ్రైగా, నిర్జీవంగా ఉంటాయి. చేతులను మృదువుగా, అందంగా మార్చుకోవడానికి కొన్ని న్యాచురల్ స్క్రబ్స్ ఉపయోగించవచ్చు.
చక్కెర, విటమిన్ ఇ ఆయిల్ స్క్రబ్ :
- రెండు టేబుల్ స్పూన్ల చక్కెరలో ఐదు చుక్కల విటమిన్ ఇ ఆయిల్ వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చేతులు, మణికట్టులపై అప్లై చేసి రెండు నిమిషాల పాటు మృదువుగా రుద్దాలి.
- ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఓట్స్, కొబ్బరి నూనె స్క్రబ్ :
- ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడిలో అర టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చేతులు, మణికట్టులపై అప్లై చేసి పావు గంట పాటు ఆరనివ్వాలి.
- ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు మృదువుగా రుద్దాలి.
- గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
నిమ్మకాయ, చక్కెర స్క్రబ్ :
- ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోయాలి.
- ఈ ముక్కలను చక్కెర పొడిలో అద్దుతూ చేతులు, మణికట్టులపై ఇరవై నిమిషాల పాటు మృదువుగా రుద్దాలి.
- ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని డెడ్ సెల్స్ నుండి శుభ్రం చేస్తుంది. చర్మానికి మెరుపును ఇస్తుంది.
కలబంద గుజ్జు స్క్రబ్ :
- కలబంద గుజ్జు తీసుకొని అందులో కాస్త చక్కెర వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చేతులపై రెండు నుండి మూడు నిమిషాల పాటు మృదువుగా రుద్దాలి.
- తర్వాత 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
- గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కలబందలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మెరుపును ఇస్తాయి. చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
స్క్రబ్స్‌ను వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల చేతులు మృదువుగా, అందంగా మారతాయి.